మురుగు కూపం..వరవ కట్ట కాలువ
ABN , Publish Date - Mar 23 , 2024 | 10:46 PM
పట్టణంలోని క్రొత్త చెరువుకు వర్షపు నీటిని సప్లయ్ చానల్ వరవ కట్ట కాలవలలో మురుగు కూపంలా మారాయ. చెత్తాచెదారాలు, వ్యర్థాలతో కాలువలు పేరుకుపోయి మురుగు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పామూరు పట్టణం మునకకు గురి కాకుండా పట్టణానికి పడమర వైపు నుంచి తూర్పు వైపునకు నీరు ప్ర వహించేందుకు వీలుగా పామూరు కొత్త చెరువు నిర్మా ణం చేపట్టి చెరువుకు సప్లయ్ చానల్‌గా వరవ కట్ట నిర్మాణం జరిగింది.
చెత్తాచెదారం, మాంసం వ్యర్థాలు
దోమల బెడద, కంపుకొడుతున్న వైనం
యథేచ్ఛగా ఆక్రమణ, అక్రమ కట్టడాలు
పామూరు, మార్చి 23 : పట్టణంలోని క్రొత్త చెరువుకు వర్షపు నీటిని సప్లయ్ చానల్ వరవ కట్ట కాలవలలో మురుగు కూపంలా మారాయ. చెత్తాచెదారాలు, వ్యర్థాలతో కాలువలు పేరుకుపోయి మురుగు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పామూరు పట్టణం మునకకు గురి కాకుండా పట్టణానికి పడమర వైపు నుంచి తూర్పు వైపునకు నీరు ప్ర వహించేందుకు వీలుగా పామూరు కొత్త చెరువు నిర్మా ణం చేపట్టి చెరువుకు సప్లయ్ చానల్‌గా వరవ కట్ట నిర్మాణం జరిగింది. అప్పట్లో తూర్పు కోడిగుడ్లపాడు ప్రాంతాల్లోని పంట పొలాల్లో కురిసిన వర్షపు నీరు, నే రుగా వరవ కట్ట కాలువ ద్వారా చెరువులోకి చేరి భూగర్భ జలాల తోపాటు చెరువులో నీరు పుష్కలంగా చేరేది. అప్పట్లో పట్టణ ప్రజలు చేరువులోగల బావుల నీటినే వాడేవారు. దాంతో ప్రభుత్వం కూడా రక్షిత మంచి నీటి పథకాలను చెరువుల వద్ద (ఓవర్‌హెడ్ ట్యాంకులు) నిర్మించి పట్టణ ప్రజలకు కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. నేడు కాక్రమేణా వరవ కట్ట కాలువ ఆక్రమణలతో కుంచించుకు పోయింది. వరవకట్ట కాలువలపై ఆక్రమణ దారులు పోటీలు పడి పక్కా కట్టడాలు నిర్మించుకొని ఇళ్లకు చెందిన వ్యర్థ నీటిని పైపుల ద్వారా సప్లయ్ చానల్‌కు వదులుతున్నారు. పట్ణంలో వ్యాపారాలు చేసుకునేవా రు, మాంసం, చేపలు, కొబ్బరి బొండాలు, మద్యం తాగేసిన ఖాళీ సీసా లు గ్లాసులు, ఇతర వ్యర్థాలను సైతం వరవ కాలువల్లో వేయడంతో అది మురుగు కూపం లా మారింది. ఆ వ్యర్థాలపై పందులు గుంపులుగా చేరి చెల్లాచెదురు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమం తా దుర్వాసన, దోమల బెడద పెరిగిపోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వరవ కట్టపై యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా యి. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు చో ద్యం చూస్తున్నారు. పైగా ఆ గృహాలకు విద్యుత్ కనెక్షన్‌లకు ధ్రువపత్రాలను ఇస్తుండడం గమనార్హం.
రోగాలకు నిలయం
వరవ కట్ట కాలువలో మురుగు ముందుకు వెళ్లడం లేదు. వ్యర్థాలతో కాలువలు నిండిపోయి దోమల ఉ త్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో పగలు, రా తి కునుకుపట్టే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలైతే దోమలు దాడి చేస్తున్నాయని చెప్తున్నారు. దీంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, విషజ్వరాల బారిన పడుతున్నామని ప్రజలు తెలిపారు.
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం
వరవ కట్ట కాలువలో చెత్త పేరుకుపోయి మురుగు కదలడం లేదు. దుర్గంధం వెదలజల్లుతోంది. దోమల బెడదతో ప్రజలు రోగాలబారిపడుతున్నారు. అయినా పంచాయతీ అధికారులకుగానీ, ఆరోగ్య సిబ్బందికి గా నీ పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కాలువ ను శుభ్రపరిచి, దోమల బెడద నుంచి కాపాడాలని కో రుతున్నారు. మాంసం, చేపల వ్యర్థాలను కాలువలో వేస్తుండడంతో అవి కుళ్లి నీళ్లు కలుషితమవుతున్నాయని, ఆ నీరు ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల ద్వారా కొళాయికు విడుదల చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. చె రువు సమీపంలో ఉన్న వాటర్‌ప్లాంట్ ద్వారా పట్టణ ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మురుగుమయమైన వరవ కట్ట కాలువపై ఆక్రమణలను, చెత్తాచెదారాన్ని తొలగించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.