తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:38 AM
అర్థవీడు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పనులపై వచ్చే ప్రజలకు పనులు జరుగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కంభం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అర్థవీడు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పనులపై వచ్చే ప్రజలకు పనులు జరుగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజులకు మండల స్థాయిలో అధికారులు సాధారణ బదిలీలు చేశారు. దీనిలో భాగంగా నెల్లూరు నుంచి అర్ధవీడు తహసీల్దార్‌గా బదిలీపై ప్రభుదాస్ వచ్చాడు. ఆయన బాధ్యతలు స్వీకరించి 10 రోజుల్లోనే గుండె పోటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌కు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈయన బేస్తవార పేట నుంచి ప్రతిరోజు అర్థవీడుకు రావలసి ఉండగా సకాలంలో రావడం లేదనే విమర్శ ఉంది. సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య మార్కాపురానికి బదిలీపై వెళ్లి నెలరోజులు కావస్తున్నా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. పలు పంచాయతీలకు వీఆర్‌వోల కొరత వేధిస్తోంది. మండలంలో 12 మంది సర్వేయర్లకు గాను ఐదుగురు మాత్ర మే విధులు నిర్వహిస్తు న్నారు. వీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరనే చర్చ నడు స్తోంది. ఇక డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వారి స్థానాల లో ఎవరినీ భర్తీ చేయ లేదు. ఇక అర్ధవీడు మండలం భౌగోళికంగా రెండుపాయలుగా చీలి ఉంది. దీంతో అర్థవీడు మండలంలో వెలగలపాయ నుంచి అర్థవీడు తహసీల్దార్ కార్యాల యానికి రావాలంటే సుమారు 70 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే రాను, పోను 140 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. ఇంత ప్రయాసపడి కార్యాలయానికి వస్తే తహసీ ల్దార్ లేరనో, ఆర్‌ఐ, ఇతర సిబ్బంది అందు బాటులో లేరని చెబుతుండడంతో వివిధ పనులపై వచ్చిన మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే తహసీల్దార్ అందుబాటులో లేరని తెలుసు కుని, ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిస్తే పాఠశాలలో ఏమి చెప్పాలో తెలియక ఇబ్బందు లు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నా రు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా మండలంలోని రెండు లోయల్లోని ప్రజలు, రైతులు చెప్పులు అరిగేలా తిరిగినా పనులు కాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవస్థలు పడుతు న్నారు. ఇప్పటికైనా అర్ధవీడు తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.