అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:01 AM
అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సచివాలయంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
మంత్రి సంధ్యారాణికి వినతి
అద్దంకిటౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సచివాలయంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని తెలుగునాడు అంగన్‌వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రధానంగా అంగన్‌వాడీలకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, సెంటర్ల నిర్వహణ భారంగా ఉన్న 4 యాప్‌లను కలిసి ఒకే యాప్ చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు ఈఎ్‌సఐ, పీఎఫ్ సౌకర్యం వర్తింపజేయాలని, వీఆర్‌ఎస్ తీసుకోవాడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ విరమణ తరువాత జీతంలో కొంత భాగం పెక్షన్‌గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అసెంబ్లీ సమావేశాలల్లో ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి, ప్రఽధాన కార్యదర్శి కొల్లి లక్ష్మినరసమ్మ, కోశాధికారి కొడాలి హేమలత, ఉపాధ్యక్షురాలు రత్నశ్రీ, కాత్యాయని, సరిత, కోకిల, రాష్ట్ర మహిళ నాయకురాలు బొప్పన నీరజ ఉన్నారు.