Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:27 AM

గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో గురువారం డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏపీవోలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు క్లోరినేషన్‌ ప్రక్రియను పటిష్టంగా అమలు చేసే విధంగా చూడాలన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గ్రామాల్లో ట్యాంకులు శుభ్రం చేయించాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ హాలులో గురువారం డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏపీవోలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు క్లోరినేషన్‌ ప్రక్రియను పటిష్టంగా అమలు చేసే విధంగా చూడాలన్నారు. ప్రతిరోజూ పారిశుధ్య ఏర్పాట్లపై వచ్చే ఫిర్యాదులను అదేరోజు పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా కంట్రోలు రూమును ఏర్పాటు చేసి రోజూ మానిటరింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సంక్రాంతి నాటికి జిల్లాలో అన్ని మండలాల్లో మంజూరైన క్యాటిల్‌ షెడ్స్‌ను పూర్తిచేయాలన్నారు. అమృత్‌ సరోవర్‌ పథకం కింద చెరువులను అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక చెరువును గుర్తించాలన్నారు. జిల్లాలో 729 గ్రామపంచాయతీల్లో 358 గ్రామాల్లో చెరువులను గుర్తించామని, మిగిలిన గ్రామాల్లో అభివృద్ధి చేయాల్సినవి గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు, రూఫ్‌టాప్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు, ఫాంపాండ్‌ నిర్మాణాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ కింద 2055.2 ఎకరాల విస్తీర్ణంలో 968 పనులు మంజూరుచేయగా 365 పనులు చేపట్టి 782.84 ఎకరాల్లో ప్లాంటేషన్‌ పూర్తిచేశారన్నారు. మిగిలిన 603 పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్‌కార్డుల వెరిఫికేషన్‌ను కూడా త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే గ్రామాల్లో తాగునీటి అవసరాలను గుర్తించి డిమాండ్‌ సర్వేను పక్కాగా నిర్వహించి ప్రతిపాదనలు పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ టాయిలెట్స్‌ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - Dec 20 , 2024 | 12:27 AM