కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:30 PM
ఎన్నో ఏళ్ళుగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వంద మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 40 మందికి కంటి ఆపరే షన్లు అవసరమని నిర్ధారించారు.
కనిగిరి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ళుగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఈ శిబిరంలో వంద మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 40 మందికి కంటి ఆపరే షన్లు అవసరమని నిర్ధారించారు. అలాగే, గత నెల 21న నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి శంకర కంటి వైద్య నిపుణులు పరీక్షలు చేసి మందులు అందచేశారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి ఆదివారం ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని కంటి వైద్య శిబిరానికి పంపించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ప్రత్యే క వాహనాలు ఏర్పాటుచేశారు. ఈ శిబిరంలో వైద్యనిపుణులు రుతూజపాటిల్ పరీక్షలు నిర్వహించారు.