స్టెప్ సీఈవోగా శ్రీమన్నారాయణ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Nov 14 , 2024 | 01:03 AM
జిల్లా యువజన సంక్షేమశాఖ (స్టెప్) ఇన్చార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.శ్రీమన్నారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఫారెస్టు సెటిల్మెం ట్ ఆఫీసర్ లోకేశ్వరరావు ఇన్చార్జిగా ఉన్నారు.
బాధ్యతల స్వీకరణ
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 13 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా యువజన సంక్షేమశాఖ (స్టెప్) ఇన్చార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.శ్రీమన్నారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఫారెస్టు సెటిల్మెం ట్ ఆఫీసర్ లోకేశ్వరరావు ఇన్చార్జిగా ఉన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు లోకేశ్వరరావు నుంచి శ్రీమన్నారాయణ పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీమన్నారాయణ మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు.