Share News

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:03 AM

క్రీడాకారులను గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఎంపీపీ కడప లక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్‌, టీడీపీ నేత ముత్తుముల కృష్ణకిషోర్‌ రెడ్డిలు పేర్కొన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 19 : క్రీడాకారులను గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఎంపీపీ కడప లక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్‌, టీడీపీ నేత ముత్తుముల కృష్ణకిషోర్‌ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఆదర్శ విద్యాసంస్థల ఆవరణలో ప్రభుత్వ పాఠశాలల గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభించారు. విద్యార్థులకు కబడ్డీ, షటిల్‌, వివిధ పోటీలో నిర్వహించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి మంచి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్‌ జె.రామయ్య, ఎంఈవోలు కె.వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వర్లు, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : విద్యార్థుల్లో క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు పోటీలు దోహదపడతాయని ఎంఈవో మస్తాన్‌నాయక్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలస్థాయి ఆటలపోటీలు గురువారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఎంఈవో మస్తాన్‌నాయక్‌, పాఠశాల ప్రధానోపాధ్యా యులు ఎస్‌వీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు పీ రామానాయక్‌, హెచ్‌ రామానాయక్‌లు పర్వవేక్షించారు. మండలంలోని రామచంద్రకోట, పెద్దబొమ్మలాపురం, ఎగువ చెర్లోపల్లి, మోడల్‌స్కూల్‌, తిమ్మాపురంలోని ఏకలవ్య, కస్తూర్బా తదితర పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, యోగా, షటిల్‌ బాడ్మింటన్‌, ఖోఖో తదితర ఆటల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో నైపుణ్యాలు కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేసి నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు పీఈటీ రామా నాయక్‌ తెలిపారు.

మండలస్థాయి క్రీడాపోటీలు ప్రారంభం

పొదిలి : స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మండలస్థాయి స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంఈవో ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యా యురాలు కరీమున్‌ బీబీ ప్రారంభించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్‌ అనురాధ, పలు పాఠశాల ప్రధానోపాధ్యా యులు, పీడి షకీలా, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయుడు కూమార్‌, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, ఖుద్దూస్‌ లు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : మండలంలోని గజ్జలకొండ గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియా మండల స్థాయి క్రీడాపోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు 19, 20 తేదీలలో జరుగుతాయని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొడ్డా రామాంజనేయరెడ్డి తెలిపారు. మండలంలోని 15 ఉన్నత పాఠశాలలలోని విద్యార్థులు సుమారు 350 క్రిడా పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు. క్రీడాపోటీలు నిర్వహిం చేందుకు 15 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలిపారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ జె కోటేశ్వరరావు, టీడీపీ గ్రామ నాయకులు నారు వెంకటేశ్వ రరెడ్డి, చిలకల అశోక్‌రెడ్డి, దాతలు బి రామారావు, రాయ.అప్పారావు, తలపాటి సుధాకర్‌, క్రీడల మండల సమన్వయకర్త పి.బాబురావు, వెంకటస్వామి, స్కౌట్‌ మాస్టర్‌ కొండయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని క్రీడలను ప్రారంభించారు.

ముగిసిన క్రీడా పోటీలు

కంభం : కంభంలో బుధవారం నుంచి ప్రారంభ మైన మండలస్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. వాలీబాల్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ కంభం పాఠశాల విద్యార్థులు గెలుపొందగా, ఖోఖో చెస్‌, బ్యాడ్మింటన్‌ నందు పెద్దనల్లకాల్వ జడ్‌పి బాలుర హైస్కూలు విద్యార్థులు గెలుపొందారు. యోగాలో జడ్‌పీహెచ్‌ఎస్‌ బాలికలు గెలుపొందారు. వీరందరూ ఈ నెల 21 నుంచి జరిగే గిద్దలూరులో జరిగే నియోజకవర్గ పోటీల్లో పాల్గొనున్నారు.

నేటి నుంచి క్రీడా పోటీలు

త్రిపురాంతకం : మండల స్థాయిలో 68వ ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీలను శుక్రవారం మేడపి జడ్పీ పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఎంఈవోలు కేటీ.మల్లికార్జుననాయక్‌, టి.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక ఎంఆర్‌సీలో పీడీలు, పీఈటీలతో సమావేశం నిర్వహించారు. ఈ పోటీలలో అండర్‌-14, అండర్‌-17 విభాగాలలో బాలబాలికలకు విడివిడిగా పోటీలను నిర్వహిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీల కోసం మండల జట్లుకు ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో మండలంలోని అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

కొమరోలు : కొమరోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అండర్‌ 14, 17 విభాగాల్లోని విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే క్రీడల్లో పాల్గొనాలని కొమ రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాశయ్య గురువారం తెలిపారు. ఈ క్రీడలు ఏడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 01:03 AM