Share News

రాష్ట్ర అగ్రికల్చర్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డిని సన్మానించిన టీడీపీ నాయకులు

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:51 PM

రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ మండల నాయకులు ఘనంగా సన్మానించారు. వైస్‌చైర్మన్‌గా నియమితులైన పూరిమెట్ల గ్రామానికి చెం దిన టీడీపీ సీనియర్‌ నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం మంగళవారం తాడేపల్లిలో జరిగింది. ఈసందర్భంగా మండలంలోని టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు, పెద్దఎత్తున వాహనాల్లో తరలివెళ్ళి ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర అగ్రికల్చర్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డిని సన్మానించిన టీడీపీ నాయకులు

ముండ్లమూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ మండల నాయకులు ఘనంగా సన్మానించారు. వైస్‌చైర్మన్‌గా నియమితులైన పూరిమెట్ల గ్రామానికి చెం దిన టీడీపీ సీనియర్‌ నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం మంగళవారం తాడేపల్లిలో జరిగింది. ఈసందర్భంగా మండలంలోని టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు, పెద్దఎత్తున వాహనాల్లో తరలివెళ్ళి ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనను భారీ గజమాలలతో, దుశ్శాలువాలతో సన్మానించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మోదేపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కం చుమాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కోడెగ మస్తాన్‌ రావు, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, ఎంపీటీసీ సభ్యులు చింతపల్లి వెంకటేశ్వరరావు, పాలపర్తి సుబ్బారావు, ఎరబోలు చంద్రశేఖరరెడ్డి, వైస్‌ ఎంపీపీ వేముల జానకి రామయ్య, సర్పంచ్‌ కూరపాటి నారాయ ణ స్వామి, మాజీ సర్పంచ్‌లు ఇందూరి పిచ్చిరెడ్డి, సుంకర రాఘవరెడ్డి, డాక్టర్‌ పాశం వెంకటేశ్వరరావు, కొర్రపాటి శ్రీనివాసరావు, నీటి వినియోగ దారుల సంఘం అధ్యక్షులు ఉన్నం పరిపూర్ణయ్య, నిడిగంటి నారాయణ, చొప్పరపు నాగేశ్వరరావు, నర్సారెడ్డి, మందలపు తిరుపతి రావు, బిజ్జం వెంకట సుబ్బారెడ్డి, గూడాల సాంబశివారెడ్డి, కట్టా చిన వెంకం బొట్లుతో పాటు వివిధ గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏలూరి

పామూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ అగ్రి కల్చర్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిం చిన తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆసంఘం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు అభినందించారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 10:51 PM