Share News

టీడీపీ సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:53 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డి కుటుంబ సభ్యులపై వికృత పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్‌ మీడి యాపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ డిమాం డ్‌ చేశారు.

టీడీపీ సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకోవాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

ఒంగోలు క్రైం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డి కుటుంబ సభ్యులపై వికృత పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్‌ మీడి యాపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ డిమాం డ్‌ చేశారు. శనివారం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఈమేరకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణి భార తిరెడ్డిపై టీడీపీ సోషల్‌ మీడియా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆమె వెంట మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ వెంకయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:53 AM