ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:55 PM
ప్రజల కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలసి హాజరయ్యారు.
ఎమ్మెల్యే ఏలూరి
టీడీపీ న్యూజిలాండ్ వెబ్సైట్ ప్రారంభం
రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం
పర్చూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజల కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలసి హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఏలూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించిందని, ప్రజల అశయాలకు ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని ఏలూరి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు 100 దేశాల్లో నిరసనలు చేపట్టారని, అందులో న్యూజిలాండ్ వారు ఉండడం మర్చిపోలేనిదన్నారు. అనంతరం న్యూజిలాండ్ వెబ్సైట్ను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దుకూరి దిలీప్, పరతాపరెడ్డి, మజీద్ సామ్యూల్, జితేంద్ర, నిమ్మగడ్డ మమత పాల్గొన్నారు.