కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - May 23 , 2024 | 01:16 AM
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో వచ్చేనెల 4వతేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు
ఒంగోలు (కలెక్టరేట్), మే 22 : ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో వచ్చేనెల 4వతేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం రైజ్ కాలేజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన చూశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతపై పోలీస్ అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. ఇతరులు లోపలికి రాకుండా తనిఖీలు చేయాలని సూచించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల సీల్‌ను పరిశీలించి అక్కడి రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్వో సుబ్బారెడ్డితోపాటు పలువురు అధికారులు ఉన్నారు.