Share News

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఉమ్మడి పోరు

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:59 AM

రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఉమ్మడి పోరు

గిద్దలూరు టౌన్‌, మార్చి 27 : రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడిగా ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేయాలని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాల యం నందు గిద్దలూరు, రాచర్ల, కొమరోలు టీడీపీ యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జులతోపాటు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి టీడీపీ కార్యకర్త రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో నెలకొన్న అరాచక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. నాడు టీడీపీలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించాల న్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మహిళ సంక్షేమం, రైతుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సైనికులాగా పని చేసి తన గెలుపుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : మాయమాటలు చెప్పి మాదిగలను జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశాడని, జగన్‌ను చిత్తుగా ఓడించాలని ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మున్నంగి నాగరాజుమాదిగ అన్నారు. బుధవారం మున్నంగి నాగరాజుమాదిగ పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డిని కలిశారు. ఆయనతోపాటు మాదిగ సంఘం నాయకులు కూడా కలిసి చంద్రబాబు గెలుపే మాదిగలకు మలుపని, అన్నారు. ఎన్‌డీఏ కూటమి బలపరచిన ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ మాదిగజాతి ప్రయోజనాలను కాపాడేవారికి అండగా ఉంటామన్నారు. ఇటీవల ఎంఆర్‌పిఎస్‌ నాయకులు మందక్రిష్ణమాదిగ, ప్రతినిధుల బృందం చంద్రబాబు నాయుడును కలిసి కొన్ని డిమాండ్లు ముందు ఉంచిందన్నారు. వర్గీకరణ అంశంపై సహకరించాలన్నదే ప్రధాన డిమాండ్‌ అని చంద్రబాబుతో పేర్కొనడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎంఆర్‌పీఎస్‌ ఉద్యమకారులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిపారు. అశోక్‌రెడ్డికే మాదిగల ఓట్లు వేస్తామని నాగరాజు తెలిపారు. నియోజకవర్గంలోని దాదాపు 25వేల మంది మాదిగల ఓట్లు అశోక్‌రెడ్డికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు వర్గీకరణ అనేది నాన్న గారి కోరిక అని, అధికారంలోకి రాగానే వర్గీకరణ సమస్యకు అనుకూలంగా తీర్మాణం చేస్తామని చెప్పిన జగన్‌ మాట మార్చారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి జలదంకి నరసింగారావు, రాష్ట్ర కార్యదర్శి పుల్లుగుజ్జు ఫ్రాంక్లిన్‌మాదిగ, జిల్లా అధ్యక్షులు తొరటి ఆనంద్‌మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూలపు ప్రకాశ్‌ మాదిగ, సీనియర్‌ నాయకులు గుర్రం దానియేలుమాదిగ, చిట్టెం ఆరోగ్యం మాదిగ, మండల అధ్యక్షులు కొమ్మునూరి వెంకటేష్‌మాదిగ, ఓబయ్యమాదిగ, ప్రసాద్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

నేను స్థానికుడిని...

గిద్దలూరు టౌన్‌ : ‘నేను స్థానికుడిని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటా’ అని టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఎంపీపీ ఎం.వెంకటరావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు టీడీపీ పట్ల ప్రజలకు నమ్మకం పెరిగి టీడీపీలో చేరుతున్నారన్నారు. వారికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో జె.రామలింగేశ్వరరావు, కె.జయచంద్రగౌడ్‌, కె.వెంకటరావు, ఎ.శ్రీను, ఎస్‌.ప్రసాద్‌, ఎం.మహేష్‌, కె.వెంకటేష్‌, కె.అనీల్‌, జె.వెంకటేశ్వర్లు, బోగోలు వార్డు సభ్యులు కొండా రమణరెడ్డి పార్టీలో చేరగా కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 01:59 AM