చెంచుల కడుపు కొడుతున్న ప్రభుత్వం
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:53 PM
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రద్దు చేసింది.
పెద్ద దోర్నాల, మార్చి 3: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రద్దు చేసింది. ఈ క్రమంలో చెంచు గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాల్లోనూ కోత పెట్టింది. దీంతో చెంచులు భారీగా నష్టపోతున్నారు.
ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పలు మార్పులు చేయడం ద్వారా అధి క సొమ్మును కోల్పోయారు. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో చెంచు గిరిజనులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. కుటుంబం లోని ప్రతి సభ్యునికి ఏడాదికి 180 రోజులు పని కల్పించింది. అంతే గాక రక్తహీనతను దృష్టిలో పెట్టుకుని వారికి ముందుగానే యాభై శాతం సొమ్మును అడ్వాన్సు గా అందజేసేవారు. ఉపాధి పని జరిగిన తర్వాత మిగిలిన సొమ్ము చేతికిచ్చే వారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే వేసవిలో 70 శాతం పనిచేస్తే 30 శాతం అలవెన్స్ అదనంగా ఇచ్చేవారు. పైగా గ్రామ సంఘం ద్వారా బ్యాంకుల్లో డ్రా చేసి గ్రామం లోనే ఎవరి సొమ్ము వారికి అందజేసే వారు. దీంతో ఆ కూలీ డబ్బు మహిళలు కుటుంబ అవసరాలకు వినియోగించే వారు. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక వారికి ప్రోత్సాహ కాలు మెరుగు పరచకబోగా, గత ప్రభుత్వానికి భిన్నంగా ఉపాధి పనుల్లో కోత విధించింది. దీంతో చెంచు గిరిజనులు తీవ్రంగా నష్ట పోయారు. ప్రస్తుతం ఏడాదికి ప్రతి కుటుంబా నికి 150రోజులు మాత్రమే ఉపాధి పనులు కల్పింస్తున్నారు. ఈ ప్రకారం కుటుంబంలో ముగ్గురు సభ్యులున్నారనుకుంటే గతంలో 540 పని దినాలు ఉండేవి. ఇప్పుడు ముగ్గిరికి కలిపి 150 దినాలు అంటే ఒక్కొక్కరికి 50 పని దినాలు మాత్రమే ఉంటున్నాయి. ఆ ప్రకారం ఒక్కో గిరిజనుడు ఏడాదికి 430 పని దినాలు కోల్పోతున్నాడు. అంటే రోజుకు రూ.272ల చొప్పున రూ.1,16,960లు నష్టపోతు న్నాడు. ఈ నాలుగేళ్ల సమయంలో లక్షల్లో నష్టపోయారు. ఇక వీరికి ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వడం లేదు. వేసవి అలవెన్స్ లేదు. పైగా బ్యాంకుల్లో కూలీ డబ్బులు డ్రా చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో మహిళలు చార్జీల రూపంలో కొంతసొమ్ము, తోడుగా భర్త లేదా కొడుకుతో వెంట రావాల్సి ఉంది. అధిక శాతం మంది వచ్చి న సొమ్ములో కొంత దురలవాట్లకు ఖర్చు చేయా ల్సి వస్తోంది. అసలే ఈ ఏడాది వర్షాభావంతో వ్యవసాయ పనులు లేవు. అటవీ ఫల సేకరణ చేద్దామంటే ఉత్పత్తులు లేవు. పనులు లేక, ప్రభుత్వ ప్రోత్సా హం లేక జీవనోపాధులు కరువై కుటుంబ పోషణ భారంగా మారిందని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.