భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:24 AM
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ఎమ్మె ల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం హనుమంతునిపాడు మండలం వాలిచర్ల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చెందిన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను భయపెట్టి, బెదిరించి వారి పేర్లతో మార్చుకున్నారన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
హనుమంతునిపాడు(కనిగిరి), డిసెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ఎమ్మె ల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం హనుమంతునిపాడు మండలం వాలిచర్ల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చెందిన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను భయపెట్టి, బెదిరించి వారి పేర్లతో మార్చుకున్నారన్నారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూ ములను, వాగు, వంక, పోరంబోకు భూములను మొత్తం మింగేసిన వైసీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామ న్నారు. పేదలకు చెందాల్సిన భూములను తిరిగి ఇప్పిస్తామ న్నారు. అక్రమంగా ప్రభుత్వ రికార్డులను మార్చి వెంచర్లు వేశారన్నారు. పేదలకు చెందిన భూములను కాజేసి వారికే ప్లాట్లు కట్టబెట్టి కోట్లకు పడగలెత్తారన్నారు. కూటమి ప్రభు త్వంలో అక్రమాలకు తావుండదన్నారు. భూములను కాజేసి న ప్రతిఒక్కరి నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, టీడీపీ మండల అ ధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్), చీకటి వెంకట సుబ్బయ్య, గాయం రామిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, పెంచికల రామకృష్ణ, తదితరులు పా ల్గొన్నారు.