పోలీ్‌సశాఖలో హోంగార్డుల పాత్ర కీలకం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:26 AM
పోలీ్‌సశాఖలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని పోలీ్‌సపెరేడ్ మైదానంలో హోంగార్డుల 62 వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఎస్పీ దామోదర్
ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
ఒంగోలు(కైం), డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): పోలీ్‌సశాఖలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని పోలీ్‌సపెరేడ్ మైదానంలో హోంగార్డుల 62 వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హోంగార్డుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీ్‌సశాఖలో హోంగార్డులు అంతర్భాగమన్నారు. పోలీసులు పని చేసే అన్ని విభాగాల్లో హోంగార్డులు పాత్ర ఉందని ప్రశంసించారు. వారి సంక్షేమం కోసం నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 774మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తుండగా వారిలో 691 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డులలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని, విద్యార్హత ఉన్నవారు ఉన్నతస్థానాలకు చేరుకోవాలని కోరారు. సమాజసేవలో పోలీసులతో పాటు హోంగార్డులు అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన జి.హనుమంతరావుతో పాటు 14మంది హోంగార్డులకు ఎస్పీ దామోదర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆర్టీసీబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్‌బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు రమే్‌షకృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.