గాడిన పడని అన్నగారి సంత
ABN , Publish Date - Nov 11 , 2024 | 11:34 PM
అద్దంకి మార్కెట్ యార్డ్ ఆవరణలలో నిర్వహించే సంతలు ఇంకా గాడిన పడలేదు. దశాబ్ద కాలం కిందట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి అద్దంకి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా అన్నగారి సంత నిర్వహణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తిం పు వచ్చింది. రైతులే స్వయంగా తమ ఉత్పత్తులను తెచ్చుకొని అమ్మకాలు చేసుకునేలా ఎన్టీఆర్ పేరుతో అన్నగారి సంతగా నామకరణం చేసి ప్రారంభించారు.
దళారులు లేకుండా నేరుగా
రైతులు అమ్ముకునే అవకాశం
తక్కువ ధరకే కూరగాయలు
పేరు మార్చిన వైసీపీ
నిర్వహణ అస్తవ్యస్తం
వ్యాపారంలోకి ప్రైవేటు వ్యాపారులు
సమస్యలు పరిష్కరించాలని
పాలకులు, అధికారులకు విజ్ఞప్తి
అద్దంకి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి మార్కెట్ యార్డ్ ఆవరణలలో నిర్వహించే సంతలు ఇంకా గాడిన పడలేదు. దశాబ్ద కాలం కిందట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి అద్దంకి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా అన్నగారి సంత నిర్వహణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తిం పు వచ్చింది. రైతులే స్వయంగా తమ ఉత్పత్తులను తెచ్చుకొని అమ్మకాలు చేసుకునేలా ఎన్టీఆర్ పేరుతో అన్నగారి సంతగా నామకరణం చేసి ప్రారంభించారు. కొనుగోలుదారులకు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందుబాటులోకి రాగా, రైతులకు కూడా ఉపయోగకరంగా దళారులు లేకుండా తాము పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునే అవకాశం రావడంతో రైతులకు కూడా లాభదాయకంగా మారింది. అద్దంకి మార్కెట్ యార్డు పరిధిలోని అద్దంకి, మేదరమెట్ల, పం గులూరులో ఉన్న యార్డులలో నిర్వహించారు. కొంతకాలం తరువాత పంగులూరులో నిలిపివేశారు. ఆదివారం అద్దంకిలో, బుధవారం మేదరమెట్లలో నిర్వహిస్తున్నారు. ముందురోజే ఆయా కూరగాయల ధరలను నిర్ధారించి, కచ్చితంగా ఆయా ధర లకే అన్ని దుకాణాలలో ని ర్వహించేలా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వ చ్చిన తరువాత అన్నగారిసంత పేరును రాజన్న సంత గా మార్పు చేశారు. నిర్వహణపై మార్కెట్ కమిటీలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సంతలో రైతుల స్థానంలో కొంత మంది వ్యాపారులు రంగ ప్రవేశం చేయడంతో సంత నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. దీంతో ఎవరి ఇష్టం వచ్చిన ధరలకే వారు అమ్మకాలు చేయడం ప్రారంభించారు. దీంతో సంత పట్ల ప్రజలలో ఆసక్తి తగ్గింది. టీడీపీ కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో అన్నగారి సంతకు పూర్వ వైభవం వస్తుందని ప్రజలు భావించారు. అయితే ఇంకా మార్కెట్ కమిటీ నియామకం జరగకపోవడంతో సంత నిర్వహణను కొంత మంది టీడీపీ నేతలు అనధికారికంగా నిర్వహిస్తున్నా ఇంకా గాడిన పడలేదన్న విమర్శలు వస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో నిర్థిష్టమైన ధరలు లేకుండా పోయాయి. అదే సమయంలో ఎవరికి వారే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా అమ్మకాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ ఏర్పడే వరకు కనీసం మార్కెట్ యార్డులో పనిచేసే సిబ్బంది ద్వారా అయినా పర్యవేక్షణ చేసేలా చర్య లు చేపట్టి అన్నగారి సంత పూర్వవైభవం చేసేలా చర్య లు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. రైతులు పం డించిన కూరగాయలను రైతులే స్వయంగా వచ్చి అమ్మకాలు చేసుకునే విధంగా రూపకల్పన చేసి మార్కెట్ యార్డు ఆధ్వర్యంలోనే నిర్వహించే విధంగా అన్ని అనుమతులు తీసుకుంటే మార్కెట్ యార్డు కమిటీలు లేనప్పుడు కూడా స క్రమంగా నిర్వహించే వీలుంటుందని పలువురు అభి ప్రాయపడుతున్నారు. ప్రస్తు తం అలా కాకుండా మార్కెట్ యార్డు పర్యవేక్షణ లేకుం డా అనధికారికంగా నిర్వహిస్తుండడంతో అజమాయిషీ లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కచ్చితంగా మార్కెట్ యార్డు ఆధ్వర్యంలోనే అద్దంకి, మేదరమెట్లలో సంతలు నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అప్పు డు మాత్రమే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సవ్యం గా జరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.