Share News

కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:50 PM

ఫిడే మహిళల ప్రపంచ రాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పోటీల్లో కోనేరు హంపి విజయం సాధించటం దేశానికి గర్వకారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశంసించారు.

కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణం

దర్శి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఫిడే మహిళల ప్రపంచ రాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పోటీల్లో కోనేరు హంపి విజయం సాధించటం దేశానికి గర్వకారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశంసించారు. ఆమె ప్రపంచ స్థాయి పోటీల్లో విజయం సాధించటంతో దిశదశలా తెలుగు ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అన్నీరంగాల్లో విజయపథంలో ముందుకు సాగాలని సూచించారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. కోనేరు హంపి మరిన్ని విజయాలను సాధించాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 29 , 2024 | 11:50 PM