Share News

ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:33 PM

2021 జూలై 29న చీరాల మండల పరిధిలోని కావూరివారి పాలెం పంచాయతీ పాలిబోయినవారిపాలెంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో 12 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ వీధంతా చిన్నాపెద్దా వృద్ధులు తేడా లేకుండా రోడ్డున పడ్డారు. ప్రమాదం కారణంగా విలువైన వస్తువులు, వెండి, బంగారు ఆభరణాలు, కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు మసయ్యాయి.

ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలి

2021లో కావూరివారిపాలెంలో షార్ట్‌సర్క్యూట్‌తో 12 పూరిళ్లు దగ్ధం

మూడేళ్లుగా బాఽధితులకు రోడ్దే దిక్కు

అప్పట్లో రూ.25 లక్షల ఆస్తి నష్టం

పట్టించుకోని అప్పటి వైసీపీ పాలకులు

ఆహుతైన పూరిళ్లు (ఫైల్‌)

చీరాలటౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : 2021 జూలై 29న చీరాల మండల పరిధిలోని కావూరివారి పాలెం పంచాయతీ పాలిబోయినవారిపాలెంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో 12 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ వీధంతా చిన్నాపెద్దా వృద్ధులు తేడా లేకుండా రోడ్డున పడ్డారు. ప్రమాదం కారణంగా విలువైన వస్తువులు, వెండి, బంగారు ఆభరణాలు, కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు మసయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అదుపు చేసేందుకు ఆరోజు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉన్నాయి. నాటి నుంచి నేటివరకూ అక్కడి వారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, చలిగాలికి సైతం పట్టలు మాటున తలదాచుకుంటూ ఆసరా కోసం ఎదురు చూ స్తున్నారు. అప్పట్లో ప్రజా ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పరామర్శించి హామీలు ఇచ్చారు. నేటికీ వారి బతుకుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అప్పటి వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. బాఽధితులు సహాయం కోసం ఎక్కని గడప లేదు, తిరగని కార్యాలయం లేదు. ఫలితం లేకపోవడంతో నిలువ నీడ లేక ఒక్కసారిగా వారి జీవితాలు అయోమయంగా మారాయి. ప్రస్తుతం ఒకరిద్దరు అప్పోసొప్పో చేసి చిన్న పాటి నివాసాలు కట్టుకుంటున్నారు. అప్పటి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం లేక శాశ్వత ఆదరణకు నోచుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా నిలువనీడ కల్పించాలని నిరాశ్రయులు వేడుకుంటున్నారు.

మూడేళ్లుగా రోడ్డు మీదే

అగ్ని ప్రమాదం కారణంగా మూడేళ్ల నుంచి రోడ్డు మీదే బతుకుతున్నాం. పూరింట్లో ఉంటూ కూలి పని చేసుకుంటు న్నాం. ఇల్లు కట్టుకునే స్థోమత లేదు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. చిన్నారులు బతుకు జీవుడా అంటూ బాధితులు రోదిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.

- శ్రీలక్ష్మీ, బాఽఽఽఽధితురాలు

ఏళ్లు గడుస్తున్నా.. ఆదరణ లేదు

మంటల్లో ఇళ్లు కాలిపోయాయి. ప్రభుత్వాలు మారుతున్నా నేటికీ సాయం లేదు. వృద్ధులతో సహా రోడ్డే దిక్కయింది. ఏళ్లు గ డుస్తున్నా బతుకుల్లో మార్పు లేదు. గృహాల మంజూరుకు ప్రభుత్వం చొరవచూపాలి.

- మంచాల అంకమ్మ,

బాఽధితురాలు

Updated Date - Oct 22 , 2024 | 11:33 PM