Share News

కేబుల్‌ ఆపరేటర్‌ను బెదిరించి..వాటాలు పంచుకుని..

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:04 AM

ఒంగోలులో కేబుల్‌ ఆపరేటర్‌పై దౌర్జన్యం చేసి అతని వద్ద బలవతంగా సంతకాలు తీసుకొని వాటాలు పంచుకున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి వద్ద ఉన్న ద్వితీయశ్రేణి నాయకుల ని ర్వాహకం ఇదీ.

కేబుల్‌ ఆపరేటర్‌ను బెదిరించి..వాటాలు పంచుకుని..

భయబ్రాంతులకు గురిచేసిన వైసీపీ నాయకులు

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఒంగోలు క్రైం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో కేబుల్‌ ఆపరేటర్‌పై దౌర్జన్యం చేసి అతని వద్ద బలవతంగా సంతకాలు తీసుకొని వాటాలు పంచుకున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి వద్ద ఉన్న ద్వితీయశ్రేణి నాయకుల ని ర్వాహకం ఇదీ. అప్పట్లో పోలీసులను ఆశ్రయిం చినా పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల లోకి వెళితే.. ఒంగోలు నగరంలో కేశవరాజు అనే కేబుల్‌ ఆపరేటర్‌ బిలాల్‌నగర్‌, కేశరాజుకుంట లో కేబుల్‌ నిర్వహిస్తుంటారు. వైసీపీ నేతల అం డతో కొంతమంది నాయకులు బలవంతంగా ఆ ప్రాంతంలో కేబుల్‌ను స్వాధీనం చేసుకునేందు కు కేశవరాజును బెదిరించారు. కేబుల్‌తో నీకు సంబంధం లేదని, అభ్యంతరం చెబితే చంపే స్తామని బెదిరించారు. దీంతో కేశవరాజు భయ పడి వైసీపీ నాయకులతో రాజీ కుదుర్చుకున్నా డు. అక్కడ వచ్చే 50శాతం ఆదాయం తమకే చెందాలని హుకుం జారీ చేశారు. ఈక్రమంలో సుమారు రూ.3.50లక్షలు తన వద్ద తీసుకున్నా రని, అంతేగాకుండా ప్రతినెలా 50శాతం ఆదా యం ఇవ్వాలని బెదిరించారని బాధితుడు కేశవ రాజు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో తనను కులం పేరుతో దూషించి భయభ్రాంతులకు గురి చేశారని శుక్రవారం ఎ స్పీ దామోదర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి వైసీపీ నాయకుల ఒత్తిడిని తట్టు కోలేక, వారికి అడిగినంత డబ్బులు ఇవ్వలేక మానసికంగా బాధపడుతూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు కేశవరాజు తెలిపారు. ఒం గోలు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:04 AM