పొగాకు ధరలు పైపైకి..
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:57 PM
పొగాకు ధరలు పైపైకి వెళ్తున్నాయి. వేలం ప్రారంభం అనంతరం నెలన్నరపాటు నిలకడగా సాగిన గరిష్ఠ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పదిరోజుల క్రితం మేలు రకం గరిష్ఠ ధర కిలో రూ.238 ఉండగా మంగవారం మార్కెట్లో రూ.279 పలికింది. అలా పదిరోజుల వ్యవధిలో కిలోకు రూ.40 వరకు మేలు రకం ధర పెరిగింది. లోగ్రేడ్ ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆ రకంలో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ ధర పదిరోజుల క్రితం కిలో రూ.225 నుంచి 230 వరకూ ఉంది.
బ్రౌన్ రకం కిలో రూ.248
ఒంగోలు-1, టంగుటూరు కేంద్రాల్లో వేలాన్ని పరిశీలించిన అధికారులు
ఒంగోలు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పొగాకు ధరలు పైపైకి వెళ్తున్నాయి. వేలం ప్రారంభం అనంతరం నెలన్నరపాటు నిలకడగా సాగిన గరిష్ఠ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పదిరోజుల క్రితం మేలు రకం గరిష్ఠ ధర కిలో రూ.238 ఉండగా మంగవారం మార్కెట్లో రూ.279 పలికింది. అలా పదిరోజుల వ్యవధిలో కిలోకు రూ.40 వరకు మేలు రకం ధర పెరిగింది. లోగ్రేడ్ ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆ రకంలో నాణ్యమైనదిగా భావించే బ్రౌన్ ధర పదిరోజుల క్రితం కిలో రూ.225 నుంచి 230 వరకూ ఉంది. గరిష్ఠంగా రూ.233 పలికింది. మంగళవారం మార్కెట్లో ఏకంగా కిలో బ్రౌన్ రకం గరిష్ఠ ధర రూ.248 లభించింది. ఒంగోలు-1 వేలం కేంద్రంలో ఈ ధరలు వచ్చాయి. ఇతర అన్ని కేంద్రాల్లోనూ కిలోకు రెండు నుంచి మూడు రూపాయలు తక్కువగా మేలురకం ధర కిలో రూ.275పైన, బ్రౌన్ రకం రూ.245పైన ఉన్నాయి. వారం క్రితం వరకు ధరల విషయంలో నిలకడగా ఉంటూ వస్తున్న ఐటీసీ కంపెనీ సైతం రెండు రోజులుగా పెంచి కొనుగోలు చేస్తోంది. పలువురు డీలర్లు. ఎగుమతిదారులుగా ఉండే కంపెనీల బయ్యర్లు బేళ్లకోసం వేలం కేంద్రాల్లో పోటీ పడుతున్నారు. ఇదిలాఉండగా పొగాకు బోర్డు ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణశ్రీ, ఒంగోలు ఆర్‌ఎం లక్ష్మణరావుతోపాటు పలువురు బోర్డు ప్రధాన కార్యాలయ అధికారులు మంగళవారం ఒంగోలు-1, టంగుటూరు వేలం కేంద్రాలను సందర్శించారు.