Share News

పొగాకు ఉత్పత్తిని నియంత్రించాలి

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:20 AM

రానున్న సీజ న్‌లో పొగాకు రైతులు పంట ఉత్పత్తిని నియంత్రిం చుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించారు.

 పొగాకు ఉత్పత్తిని నియంత్రించాలి

ఎంపీ మాగుంట సూచన

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 3: రానున్న సీజ న్‌లో పొగాకు రైతులు పంట ఉత్పత్తిని నియంత్రిం చుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించారు. రెండేళ్ళుగా లభిస్తున్న మంచిధర లకు కారణాలు హేతుబద్ధంగా ఆలోచించాలన్నా రు. అలా కాకుండా ఎక్కువ పంట ఉత్పత్తి చేస్తే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఇబ్బందులు ప డతారని, ఆలాంటి పరిస్థితి రాకుండా రైతు నా యకులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ప్రస్తుత సీజన్‌లో అధిక పంట ఉత్పత్తికి అపరాధ రుసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం విదితమే. అందుకు కృషి చేసిన ఎంపీ మాగుంటను శనివారం ఒంగోలులోని తన కార్యాలయంలో రైతు ప్రతినిధులు కలిసి సత్కరిం చారు. అపరాధ రుసుం రద్దుకు సహకారం అందిం చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సం తనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ కూడా వారు సత్కరించారు. కాగా ప్రస్తుత మార్కె ట్‌ తీరు లభిస్తున్న ధరలు, వచ్చే సీజన్‌ పంట సాగు తదితర అంశాలను రైతు ప్రతినిధులను అ డిగి తెలుసుకున్నారు. పంట సాగులో అప్రమత్తం గా ఉండాలన్నారు. వీలైనంత మేర ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఉత్పత్తిపై స్వీయనియం త్రణ పాటించాలని సూచించారు. రైతు ప్రతినిధు లు ప్రస్తావించిన పలు అంశాలను పొగాకు బోర్డు అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకె ళ్తానని వారికి మాగుంట హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో రైతు ప్రతినిధులు వడ్డెళ్ళ ప్రసాద్‌, పోతుల ప్రసాదరావు, పోటు మురళీ, ఆళ్ల సుబ్బారావు, మండవ నాగేశ్వరరావు, రావి ఉమామహేశ్వర రావు, అబ్బూరి శేషగిరిరావు, గురువారెడ్డి, పెనుబో తు సునీల్‌, పలు వేలం కేంద్రాల రైతు సంఘ ప్ర తినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 12:20 AM