Share News

నేడు కూటమి నేతల సమావేశం

ABN , Publish Date - Oct 30 , 2024 | 02:14 AM

అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జిల్లాస్థాయి నేతల సంయుక్త సమా వేశం బుధవారం ఒంగోలులో జరగనుంది. స్థానిక భాగ్యనగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి హాజరుకానున్నారు.

నేడు కూటమి నేతల సమావేశం

హాజరుకానున్న ఇన్‌చార్జి మంత్రి ఆనం

ఒంగోలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జిల్లాస్థాయి నేతల సంయుక్త సమా వేశం బుధవారం ఒంగోలులో జరగనుంది. స్థానిక భాగ్యనగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడం, మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా సర్దుబాటు, నామినేటెడ్‌ పదవులు ఇతరత్రా విషయాల్లో సమన్వయంతో పనిచేసేలా జిల్లా స్థాయిలో ఇలాంటి సమావేశాల నిర్వహణకు రాష్ట్ర పార్టీలు నిర్ణయించాయి. తదనుగుణంగా ఇన్‌చార్జీ మంత్రుల పర్యవేక్షణలో వాటిని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం ఒంగోలులో నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ఈ స మావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో టీడీపీ నుంచి మంత్రి డాక్టర్‌ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఇతర ముఖ్యనేతలు అలాగే కూటమి పార్టీలైన జనసేన, బీజేపీల నుంచి ఆ పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని సమాచారం. కాగా ఇన్‌చార్జీ మంత్రి ఆనం బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయానికి చేరుకొని అనంతరం టీడీపీ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 06:16 AM