కొండెక్కిన కోడి గుడ్డు
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:37 AM
పామూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డు హోల్‌సేల్‌లోనే రూ.7కు చేరింది. వంద గుడ్ల ధర రూ.700 పలుకుతోంది. చిల్లర దుకాణాల్లో ఒక్కో గుడ్డు రూ.8కు విక్రయిస్తున్నారు.
చిల్లర దుకాణాల్లో ఒక్కొక్కటి రూ.8
పామూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డు హోల్‌సేల్‌లోనే రూ.7కు చేరింది. వంద గుడ్ల ధర రూ.700 పలుకుతోంది. చిల్లర దుకాణాల్లో ఒక్కో గుడ్డు రూ.8కు విక్రయిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడం, కార్తీక మాసం ముగియడం కూడా ధరల పెరుగుదలకు కారణమని చెప్తున్నారు.