Share News

వెలుగు పీడీ బదిలీ

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:21 AM

వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.వసుంధర మరోసారి బదిలీ అయ్యారు. ఆమెను శ్రీకాళహస్తికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నెలక్రితం ప్రభుత్వం వసుంధరను నెల్లూరు జిల్లా డీఎల్‌డీవోగా బదిలీ చేసింది.

వెలుగు పీడీ బదిలీ

శ్రీకాళహస్తి ఈటీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా నియామకం

ఒంగోలు నగరం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ టి.వసుంధర మరోసారి బదిలీ అయ్యారు. ఆమెను శ్రీకాళహస్తికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నెలక్రితం ప్రభుత్వం వసుంధరను నెల్లూరు జిల్లా డీఎల్‌డీవోగా బదిలీ చేసింది. కానీ అక్కడ పనిచేస్తున్న డీఎల్‌డీవో విధుల నుంచి రిలీవ్‌ కాకపోవడంతో ఈమె ఇక్కడ పీడీగానే కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో వసుం ధరను కాళహస్తిలోని ఈటీసీలో గజిటెడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 24 , 2024 | 01:21 AM