సిమెంట్ రోడ్లతో పల్లెలు కళకళ
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:20 AM
కూటమి ప్రభుత్వం తీసుకున్న పల్లెపండుగ నిర్ణయంతో పల్లెలు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయి.
పొదిలి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం తీసుకున్న పల్లెపండుగ నిర్ణయంతో పల్లెలు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో సిమెంట్‌రోడ్ల నిర్మాణంతో పల్లెలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో సుమారుగా 6.3 కిలోమీటర్ల మేర రూ.2.65 కోట్ల నిధులతో సిమెంట్‌రోడ్లు, సైడుకాలువల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కచెరువు రూ.20లక్షలు, జువ్వలేరు రూ.12లక్షలు, మల్లవరం రూ.6లక్షలు, మల్లవరం- 2 రూ.5లక్షలు, సూదనగుంట రూ.20లక్షలు, ఽతుమ్మగుంట రూ.7లక్షలు, తలమళ్ల రూ.20లక్షలు, తలమళ్ళ-2 రూ.5లక్షలు, కుంచేపల్లి రూ.20లక్షలు, కుంచేపల్లి-2 రూ.5లక్షలు, కొండాయపాలెం రూ.30లక్షలు, ఉప్పలపాడు రూ.13లక్షలు, ఏలూరు రూ.15లక్షలు, ఓబులక్కపల్లి రూ.7లక్షలు, ఆముదాలపల్లి రూ.15లక్షలు, అన్నవరం రూ.15లక్షలు, ఈగలపాడు రూ.30లక్షలు, పాములపాడు రూ.10లక్షలు, మూగచింతల రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సంక్రాంతి నాటికి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సిమెంట్ రోడ్ల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుందని ఎంపీడీవో శోభన్‌బాబు తెలిపారు. ఇప్పటి వరకు సగానికిపైగా రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. కిలోమీటర్‌పైగా రోడ్లు నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ ఏఈ రామకృష్ణ తెలిపారు. ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అంతర్గత రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైంది. కొద్దిపాటి వర్షాలకే అంతర్గత రోడ్లు కుంటలను తలపిస్తూ బురదమయమౌతున్నా పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాలు మురికి కూపాలుగా మారాయి. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అంతర్గతరోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. గ్రామాలలో సిమెంట్‌రోడ్డు పనులు జరుగుతుండటంతో అటు కూలీలకు ఉపాధితోపాటు ఇటు ప్రగతి పనులు వేగంగా సాగుతుండటంతో గ్రామ సీమలు నూతనశోభను సంతరించుకుంటునానయి. మండలంలోని గోగినేనివారి పాలెం గ్రామంలో జరుగుతున్న సిమెంట్‌రోడ్డు పనులను ఎంపీడీవో శోభన్‌బాబు, పంచాయతీరాజ్ ఏఈ రామకృష్ణలు పరిశీలించారు. సిమెంట్‌రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పనులు నాణ్యంగా ఉండేలా చేయాలని నిర్వాహకులకు ఎంపీడీవో సూచించారు.