టీడీపీతోనే గ్రామాభివృద్ధి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:50 PM
టీడీపీతోనే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు అమలు జరుగుతాయని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సీఎస్‌పురం మండ లంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందు గా సీఎస్‌పురంలో రూ.3 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను సర్పంచ్ శ్రీరాం పద్మావతితో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
సీఎస్‌పురం(పామూరు), డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): టీడీపీతోనే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు అమలు జరుగుతాయని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సీఎస్‌పురం మండ లంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందు గా సీఎస్‌పురంలో రూ.3 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను సర్పంచ్ శ్రీరాం పద్మావతితో కలిసి ప్రారంభించారు. అ నంతరం మండలంలోని చింతపూడులో గ్రామంలో రై తు భరోసా కేంద్రాన్ని ప్రాంభించారు. ఈసందర్భంగా 80 శాతం రాయితీపై శనగ విత్తనాలు, చావా సుబ్బ య్యకు రాయితి కింద ఫ్రెషర్ మిషన్‌ను అందజేశారు. సీనాగులారంలో జీవీఆర్ ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్ వర్మ ఆర్థిక సహకారంతో రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి ఎంఅంజలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఉగ్ర మాట్లాడుతూ పేదలను ఆదుకోవాలనే దాతృత్వం కలిగిన వ్వక్తి శ్రీనివాస్‌వర్మ అని కొనియాడారు. చింతపూడును మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారుచే యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో మం డల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ మండల అ ధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, యారవ శ్రీను, మా జీ ఎంపీపీ తోడేటి పెద అల్లూరయ్య, ఎన్‌సీ మాలకొండ య్య, గోపి, బీజేపీ నిమోజకవర్గ కన్వీనర్ కేవీ రమణయ్య, ఎంపీడీవో రంగసుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
‘వెలిగొండ’కు మోపాడు రిజర్వాయర్ అనుసంధానం
పామూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టుకు మోపాడు రిజర్వాయర్‌ను అనుసంధానం చేసి క్షామపీడిత నివారణకు కృషిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలం లోని మోపాడు రిజర్వాయర్ వద్ద జరిగిన ప్రాజెక్టు సూ పర్ చైర్మన్ చుంచు కొండయ్య, వైస్‌చైర్మన్ ఎం.నరసిం హారావు ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వెలిగొండ నీటిని మోపాడుకు అనుసంధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి రామానాయుడును కలిసి నివేదిక అందజేశానన్నారు. నియోజకవర్గంలోని సాగునీ టి చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరుచేయాలని కోరినట్టు చెప్పారు. గత వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్వవస్థ నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. దొంగ బిల్లులు పెట్టుకొని నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిం చారు. జైకో నిధులతో ప్రస్తుతం రూ.10 కోట్ల మేర పనులు జరిగాయన్నారు. చెరువు అభివృద్ధి పనులపై ఆయకట్టుదారులు కూడా దృష్టి సారించి పర్యవేక్షించాలని సూచించారు. రిజర్వాయర్ కట్ట బలోపేత పనులు చేప ట్టాలని ఇరిగేషన్ డీఈని ఆదేశించారు. అనంతరం చైర్మ న్, వైస్‌చైర్మన్‌లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ పామూరు, పీసీపల్లి మండలాల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, వేమూరి రామయ్య, నాగేశ్వరరావు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, కమ్మ ప్రసాద్, ఉడుతా కిశోర్, ఎం.హుసేన్‌రావు, మన్నం రమణయ్య, పచ్చా బాబు, జి.దశరథరాములు, కొండబా బు, సుబ్బయ్య, గోళ్ల మాల్యాద్రినాయుడు, గోళ్ల కేశవులు, అడుసుమల్లి నరసింహులు, వై.ప్రసాద్‌రెడ్డి, కౌలూరి ఖాజారహంతుల్లా, రాజే ష్, ఏఈ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదవారికి భరోసా!
కనిగిరి : ఆరోగ్య సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఆస రానిచ్చి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం వివిధ అనారోగ్య సమస్యలతో భాదపడే వారికి సీఎం సహాయం నిధి నుంచి రూ.19లక్షల 68వేల 731మేర చెక్కులను 9మందికి కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు గోగడి నాగేశ్వరరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
వీరిలో గొరిగె లక్ష్మీప్రణతికి రూ.6 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు. సీఎం సహాయనిధి ద్వారా కొంతమందికైనా తగిన వైద్యం అందుతుంటే ఆనందంగా ఉన్నప్పటికీ ఏఒక్కరూ అనారోగ్యంతో తనువు చాలించకుండా చూసుకోవాలన్నదే తన సంకల్ప మన్నారు.