Share News

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:53 PM

రైతులకు నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను అందిస్తామని ఆ శాఖ అద్దంకి డీవిజన్‌ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు తెలిపారు. సోమవారం మండలంలోని గుంటుపల్లి, చెన్నుపల్లి గ్రామాలలో రైతులతో విద్యుత్‌ అధికార్లు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈఈ మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొన్న రైతులకు సకాలంలో కొత్త లైన్లు ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్‌ను అందజేస్తామన్నారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం

ఈఈ మస్తాన్‌రావు

బల్లికురవ. అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : రైతులకు నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను అందిస్తామని ఆ శాఖ అద్దంకి డీవిజన్‌ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు తెలిపారు. సోమవారం మండలంలోని గుంటుపల్లి, చెన్నుపల్లి గ్రామాలలో రైతులతో విద్యుత్‌ అధికార్లు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈఈ మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొన్న రైతులకు సకాలంలో కొత్త లైన్లు ఏర్పాటు చేసి మెరుగైన విద్యుత్‌ను అందజేస్తామన్నారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన లైన్లను మంజూరు చేయిస్తామన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశాల మేరకు పంటలకు పగటి సమయంలో 9 గంటల కరెంట్‌ అందిస్తామని, ఈమేరకు రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో గృహాలకు లోవోల్టేజీ సమస్య రాకుండా ట్రాన్స్‌పార్మర్లను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలను మార్పు, త్రిఫేజ్‌ లైన్‌ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నట్లు ఈఈ మస్తాన్‌రావు తెలిపారు. సమావేశంలో మార్టూరు ఏడీఈఈ సురేంద్రబాబు, ఏఈ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మలినేని గోవిందరావు, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:53 PM