భాదితులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:54 PM
ప్రజోపకరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టే పనులతో నష్టపోయే బాధితులకూ అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు తో భూమిని కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంతో పాటు ఇంటి పట్టాలు మంజూరుచేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పట్టాలు అందజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) ప్రజోపకరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టే పనులతో నష్టపోయే బాధితులకూ అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు తో భూమిని కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంతో పాటు ఇంటి పట్టాలు మంజూరుచేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పట్టాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్ కని గిరి పట్టణ సమీపంలోని పేరంగుడిపల్లి గ్రా మం వద్ద నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో భూమని కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారంతో పాటు నిర్వాసితులకు ఇంటి పట్టా లు అందజేస్తున్నట్టు చెప్పారు. కనిగిరి అభివృద్ధి లో ప్రధాన భాగమైన రైల్వే మార్గం ఈప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. ప్రజల మేలుకోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో కేవశర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ అశోక్ రెడ్డి, జనసేన నాయకుడు వరికూటి నాగరాజు తదితరు లు పాల్గొన్నారు.