రీసర్వేలో సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Oct 29 , 2024 | 11:42 PM
ప్రజల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ల క్ష్యం అని చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయు డు అన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్‌డీఓ చం ద్ర శేఖరనాయుడు హాజరై అర్జీలను స్వీకరించారు.
అద్దంకి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ల క్ష్యం అని చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయు డు అన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్‌డీఓ చం ద్ర శేఖరనాయుడు హాజరై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తమ భూమి వేరే వ్యక్తి పేరు తో ఆన్‌లైన్ లో ఉందని రైతు అర్జీ అందజేయగా వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు. సర్వే కోసం మరో రైతు అర్జీ ఇచ్చారు. తహీసల్దార్ శ్రీచరణ్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్‌ఐ శంకర్ పాల్గొన్నారు.
పంగులూరు : రీసర్వేలో తలెత్తిన అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ పీ సింగారావు తెలిపారు. మండలంలోని కోటపాడు గ్రామంలో రీసర్వే సమస్యల పరిష్కారం కోసం మంగళవారం గ్రామసభను నిర్వహించారు. ఎల్‌పీఎంతో తలెత్తిన సమస్యలను సబ్ డివిజన్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. విస్తీర్ణంలో వ్యత్యాసాలు, మ్యూటేషన్ డంటి సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు దరఖాస్తులను అందచేశారు. కార్యక్రమంలో రీసర్వే డీటీ అర్జున్, మండల సర్వేయర్ బి.సురేష్, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో పాటు నాయకులు గడ్డం నాగేశ్వరరావు, తాటి సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.
మేదరమెట్ల : గత రీ సర్వేలో తలెత్తిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సోమవరప్పాడులో భూ సమస్యలను రైతులు తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. ఉండాల్సిన విస్తీర్ణం కన్నా తక్కువ భూమితో పాసు పుస్తకాలను ఇచ్చారని రైతులు చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బొనిగల ఎలీశమ్మ, ఉప సర్పంచ్ మన్నె దుర్గారావు, డీటీ రవికాంత్, సర్వేయర్ మహే్‌షబాబు, గ్రామ సర్వేయర్‌లు ఇమ్మానియేలు పాల్గన్నారు.
చినగంజాం : భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలను నిర్వహిస్తున్నామని డిప్యూ టీ తహసీల్దార్ సుజాత అన్నారు. మండలంలోని కడవకుదురు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో 82 మంది రైతుల నుంచి అర్జీలను స్వీకరించినట్లు డీటీ తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ సుబ్బారావు, ఇన్‌చార్జ్ ఆర్‌ఐ నాగేశ్వరరావు, గ్రామ రెవెన్యూ అధికారులు పి.నాగరాజు, ఆమంచి సత్యనారాయణ, గ్రామ సర్వేయర్లు, వీఆర్‌ఏలు, మాజీ ఉపసర్పంచ్ వీరరాఘవులు పాల్గొన్నారు.
ఇంకొల్లు : మండలంలోని నాగండ్ల గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభలో భూ రీసర్వేకి 70 అర్జీలు అందినట్లు తహసీల్దారు వెంకటరత్నం తెలిపారు.
కార్యక్రమంలో గ్రామస్థులు, రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్ పద్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.