నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరాలి
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:29 PM
చీరాల మండల పరిధిలో వెనుకబడిన, గుర్తింపు పొందని వారి వివరాలను వేగవంతంగా సేకరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం అన్నా రు. మండల కార్యాలయంలో శనివారం సచివాలయాల సిబ్బందితో సమావే శం నిర్వహించారు.
ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం
చీరాలటౌన్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి) : చీరాల మండల పరిధిలో వెనుకబడిన, గుర్తింపు పొందని వారి వివరాలను వేగవంతంగా సేకరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం అన్నా రు. మండల కార్యాలయంలో శనివారం సచివాలయాల సిబ్బందితో సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యంతో పాటు సంక్షేమాలు పారదర్శకంగా అందించాలన్నారు. మండల పరిధిలో ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు, వివిధ గుర్తింపులేని వెనుకబడిన తరుగతుల వారి వివరాలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ రామకృష్ణ, పంచాయతీల సెక్రటరీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రేపటి నుంచి కుటుంబ సర్వే : ఎంపీడీవో సింగయ్య
అద్దంకిటౌన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాలలో వెనుకబడిన బీసీ-ఏ కులాలైన 32 కులాల కుటుంబాలకు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు సర్వే చేయనున్నట్లు ఎంపీడీవో బ త్తిని సింగయ్య శనివారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కులాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. 32 కులాల కుటుంబాలు సర్వే సిబ్బందికి సహకరించాలని ఎంపీడీవో కోరారు.