Share News

సంక్షేమ రాజ్యం

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:37 AM

సంక్షేమ రాజ్యం మళ్లీ మొదలైంది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు మూలన పడేసిన పథకాలకు తిరిగి జీవం రానుంది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను తిరిగి ఆయా వర్గాలకు అందించే దిశగా నిధులు కేటాయింపులు చేసింది. వీటిని తక్షణమే అ మల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీంతో ఆయా వర్గాలకు ఊరట లభించినట్లైంది. కొత్త పథకాలతో పాటు కొర్పొరేషన్‌ రుణాలతో ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.

సంక్షేమ రాజ్యం

ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు పూర్వవైభవం

బడుగుల చేయూతకు పాతరేసిన వైసీపీ

పథకాల పునఃప్రారంభానికి భారీగా నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం

వాటి అమలుతో కళకళలాడనున్న అన్ని కార్పొరేషన్‌ కార్యాలయాలు

‘జగనన్న’ పేరు తొలగింపు.. అంబేడ్కర్‌ పేరుతో తిరిగి ప్రారంభం

విదేశీ విద్య, బెస్టు అవైలబుల్‌ స్కూల్స్‌తో సహా పథకాల అమలు

సంక్షేమ రాజ్యం మళ్లీ మొదలైంది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలకులు మూలన పడేసిన పథకాలకు తిరిగి జీవం రానుంది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను తిరిగి ఆయా వర్గాలకు అందించే దిశగా నిధులు కేటాయింపులు చేసింది. వీటిని తక్షణమే అ మల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీంతో ఆయా వర్గాలకు ఊరట లభించినట్లైంది. కొత్త పథకాలతో పాటు కొర్పొరేషన్‌ రుణాలతో ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.

ఒంగోలు నగరం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో అటకెక్కిన సంక్షేమ పథకాలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కళకళలాడిన కార్పొరేషన్లు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులు లేక నీరసించిపోయాయి. రూపాయి అంటే రూపాయి కూడా జగన్‌.. బడుగుల కార్పొరేషన్లకు కేటాయించలేదు. దీంతోపాటు గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ పక్కన పడేసింది. స్వయంఉపాధి, భూమి కొనుగోలు పథకాలు, విలువైన వాహన యూనిట్లు, బీసీ కార్పొరేషన్‌ ద్వారా చేతివృత్తుల వారికి ఆదరణ పథకం కింద అందించే పనిముట్లు, పడవలు, వలలు, ఎస్సీలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చి వాటిని సాగు చేసుకునేందుకు బోర్లు, కరెంటు మోటార్లు అందించే పథకాలన్నీ వైసీపీ అధికారంలోకి రావటంతోనే నిలిపివేశారు. వీటితోపాటు సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖల ద్వారా అమలు జరిగే అంబేడ్కర్‌ విదేశీ విద్య, బెస్టు అవైలబుల్‌ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఇంటర్‌లో కార్పొరేట్‌ విద్యను అందించడం వంటి అనేక పథకాలను గత ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది.

బీసీ సంక్షేమానికి పెద్దపీట

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. మొత్తం రూ.39,007 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొద్దిరోజుల్లోనే అనేక పథకాలు అమలు కానున్నాయి. స్వయం ఉపాధి పథకాలతోపాటు కార్పొరేషన్ల ద్వారా నేరుగా అందించే పలు రుణాలు వారికి అందనున్నాయి.

కేటాయించిన నిధులు

బీసీ కార్పొరేషన్‌కు రూ.896.79 కోట్లు

బీసీ ఏ కార్పొరేషన్‌కు రూ.276.24 కోట్లు

బీసీ బీ కార్పొరేషన్‌కు రూ.243.01 కోట్లు

బీసీ డీ కార్పొరేషన్‌కు రూ.284.82 కోట్లు

బీసీ ఈ కార్పొరేషన్‌కు రూ.92.72 కోట్లు

ఎస్సీల సంక్షేమానికి రూ.18,497 కోట్లు

రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం రూ.18,497 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గతంలో నిలిపివేసిన అనేక పథకాలను పునరుద్ధరించనున్నారు. ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వం దళిత విద్యార్థుల చదువులను అర్ధంతరంగా ఆపేస్తూ బెస్టు అ వైల్‌బుల్‌ స్కూల్స్‌ పథకాన్ని అధికారంలోకి రావటంతోనే వైసీపీ నిలిపివేసింది. దీంతో ఈ పథకం కింద ప్రయివేట్‌ పాఠశాల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలాంటి వారికి ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. ఎస్సీ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కూటమి ప్రభుత్వం భారీగానే ఽనిధులను కేటాయించింది. ఎన్టీఆర్‌ విద్యోన్నతి, అంబేద్కర్‌ విదేశీ విద్య పథకాలు ఇక అర్హులైన ఎస్సీలందరికీ అందనున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు వేలాది మంది నిరుద్యోగులకు అందనున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన ఎన్‌ఎ్‌ససీఎ్‌ఫడీసీ పథకం తిరిగి అమలు కానుంది. కేంద్రప్రభుత్వ నిధులతో, బ్యాంకులతో సంబంఽధం లేకుండా యూనిట్లను అందజేసే ఈ పథకం కింద యూనిట్లను ఈ ఏడాదిలోనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. వీటితో పాటు గిరిజన సంక్షేమానికి రూ.7,557 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.4,376కోట్లు కేటాయించారు. దీంతో ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కూడా స్వయం ఉపాధి యూనిట్లకు వందలాది మంది నిరుద్యోగులకు జిల్లాలో రుణాలు అందనున్నాయి. మొత్తంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు పూర్వవైభవం తేనుంది.


స్వయం ఉపాధికి రూ.3వేల కోట్లు

ఇటీవలి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బ్యాంకుల నుంచి రుణం పుట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్ల నుంచి ఏటా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించి ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రుణాలు అందజేశారు. ఇందులో ఎక్కువగా బ్యాంకు లింకేజి రుణాలు ఉండేవి. ఏటా జిల్లాలో వేలాది మందికి బ్యాంకుల ద్వారా రుణాలు అందేవి. వాటితో బడుగులు స్వయంఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకునే వారు. దళిత వర్గాలకు చెందిన లబ్ధిదారుడు యూనిట్‌ ఏర్పాటు చేసుకుంటే అందులో సగం కార్పొరేషన్లు భరించగా మిగిలిన సగం బ్యాంకులు రుణంగా ఇచ్చేవి. గత ఐదేళ్లలో కార్పొరేషన్లకు ఒక్క ఏడాది కూడా వార్షిక రుణ ప్రణాళికను తయారే చేయలేదు. దీంతో కార్పొరేషన్లు బోర్డులకే పరిమితం అయిపోయాయి. వైసీపీ హయాంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణం అందనేలేదు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు రూ. 3వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసింది. ఇందులో రూ.1,571 కోట్లు రాష్ట్రప్రభుత్వం కార్పొరేషన్ల్‌ ద్వారా ఇవ్వనుండగా మిగిలిన మొత్తం బ్యాంకులు రుణంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. వీటితో వందలాది స్యయం ఉపాధి యూనిట్లు ఏర్పాటవుతాయి.

Updated Date - Nov 15 , 2024 | 12:37 AM