Share News

వామ్మో.! ఓ వైపు కోతులు, మరోవైపు కుక్కలు

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:27 AM

ఎర్రగొండపాలెం మండల ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాం తులకు గురవుతున్నారు. వివిధ పనుల నిమి త్తం బయటకు రావాలన్నా, పోవాలన్నా కుక్క లు, కోతులు దాడి చేస్తాయని బెదిరి పోతు న్నారు.

వామ్మో.! ఓ వైపు కోతులు, మరోవైపు కుక్కలు

ఎర్రగొండపాలెం రూరల్‌ నవంబరు 14 , (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం మండల ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాం తులకు గురవుతున్నారు. వివిధ పనుల నిమి త్తం బయటకు రావాలన్నా, పోవాలన్నా కుక్క లు, కోతులు దాడి చేస్తాయని బెదిరి పోతు న్నారు. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో వీధులలో తిరుగుతూ ప్రజలపైకి దూకుతున్నా యి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. అటవీ ప్రాంతాలలో ఉండాల్సి న కోతులు నివాస ప్రాంతాలకు వచ్చి గృహాల ను గుల్ల చేస్తున్నాయని మహిళలు అంటున్నారు.

గతంలో ఇదేతరహాలో కోతులు తిరగ్గా, పంచాయితీ అధికారులు కొండముచ్చును వీధుల్లో తిప్పి కొతుల బెడద నుండి విముక్తి కల్పించారు. నాలుగు రోజుల నుండి మళ్లి కోతుల గుంపులు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భయంతో బయటికి రాలేని పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకొవచ్చు. ఒక వైపు కోతుల బెడద అయితే మరో వైపు కుక్కల గుంపు తోడైంది. కుక్కలు కూడ పదుల సంఖ్యలో భౌ..భౌ.. అంటూ ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుక్క దాడిలో ప్రాణాలు, గాయాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇక్కడ జరగకముందే అధికారులు స్పందించి కోతులను, కుక్కలను పట్టుకొని అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:28 AM