పొగాకునారు ధరలకు రెక్కలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 11:41 PM
ఇటీవల కురిసిన వర్షాలకు సాగు చేసిన పొగాకు తోటలతో పాటు నారుమడులు దెబ్బతిన్నాయి.
పొదిలి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు సాగు చేసిన పొగాకు తోటలతో పాటు నారుమడులు దెబ్బతిన్నాయి. దీంతో పొగనారు ధరలకు రెక్కలొచ్చాయి. స్థానికంగా నారు దొరక్క పోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి నారు అధిక ధరలకు తెచ్చి నాట్లు వేస్తున్నారు.
గతేడాది రైతులకు పొగాకు సాగు చేసిన రైతులు లాభాలు గడించారు. దీంతో మండలం లో పొగాకు సాగు కూడా బాగా పెరిగింది. అయితే డిమాండ్‌కు తగినట్లు నారు పుష్కలం గా అందుబాటులో లేదు. ఈ క్రమంలోనే వర్షాలకు పొగ తోటలతోపాటు నారుమడులు దెబ్బతిన్నాయి. తగినంత నారు లేకపోవడంతో సుదూర ప్రాంతం రాజ మండ్రి వెళ్లి నారు తెచ్చు కుంటున్నారు. ఇప్పటికే నాటిన పొగా కు కూడా వర్షాలకు కుళ్లిపోవడంతో తిరిగి నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పొగనారు గిరాకీ అమాం తం పెరిగింది. నారుమడులు కొన్ని దెబ్బతినడం మరి కొన్నింటిలో తెగుళ్లు, గుళ్లరావడంతో నాణ్యతపై అనుమానం తో రైతులు ఉన్నారు. మడిలో ఉన్న నాణ్యమైన పొగాకునారుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇప్పటి వరకు పొగనారు మూట రూ.1500 ఉండగా, ప్రస్తుతం 4వేలకు పెరిగిం ది. ఎకరాకు దీంతో ఎకరాకు రూ.9వేలు నారుకే ఖర్చు అవుతోందని పొగాకు సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు.
మూటలో తగ్గుతున్న మొక్కలు
నారుకు గిరాకీ పెరగడంతో మడులు ఉన్న యజమానులు సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. గతంలో మూటలో 6 వేల మొక్కలు ఉండేవి. ప్రస్తుతం కేవలం 5వేలు మాత్రమే ఉంటున్నాయి. ఇప్పటి వరకు మండలంలో 6వేల హెక్టార్లలో పొగాకు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది పొగాకుకు మంచి గిరాకీ రావడంతో ఈఏడాది సాగు విస్తీర్ణం పెరగ్గా, కొత్త బ్యారన్ల నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి. ఏది ఏమైనా ఇటీవల కురిసిన వర్షాలకు పొగాకు రైతుల పరిస్థితి అచమ్యగోచరంగా మారింది.