Share News

పేదల సంక్షేమం కోసం కృషి

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:37 AM

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

పేదల సంక్షేమం కోసం కృషి

గిద్దలూరు టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన దీపం పథ కాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని శ్రీరామ భారత్‌ గ్యాస్‌ నందు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడు తూ పేదల సంక్షేమం కోసం ఎన్‌డీఏ కూటమి అండగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పేదరికంలేని రాష్ట్రం గా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశ లు శ్రమిస్తున్నారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి పేదల సంక్షేమానికి మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘా లు, మహిళల పేరు మీద ఇళ్లపట్టాలు, ఇంటినిర్మాణం, భూమి కొనుగోలు వంటి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. మహిళల శక్తిని మహాశక్తిగా చేయాలని, పేదవారిని సంపన్నులుగా చూడాలనే దృఢ సంకల్పంతో ఇటీవల ఎన్నికలలో సూపర్‌ సిక్స్‌ పథకాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అధికారం చేపట్ట గానే ఒక్కో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు పథకం అమలులోకి వచ్చిందని, ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్‌ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, కమిషనర్‌ వెంకటదాస్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో చెన్నారావు, కౌన్సెలర్లు లొక్కు రమేష్‌, చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు షానేషావలి, టీడీపీ నాయకులు దప్పిలి కాశిరెడ్డి, దుత్తా బాలీశ్వరయ్య, బిల్లారమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం (పుల్లలచెరువు) : ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని చైతన్యనగర్‌లో మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలెండర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి కానుక కింద సూపర్‌ సిక్స్‌లో భాగంగా పేదల కుటుంబాలకు ఏడాదికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంద న్నారు. రూ.100తో సభ్యత్వం తీసుకుంటే ప్రమాదబీమా రూ.5 లక్షలు, మట్టి ఖర్చులకు రూ.10 వేలు అందజేస్తార న్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, వేగినాటి శ్రీనివాస్‌, మెడబలిమి అచ్యుత రావు, చేదూరి కిషోర్‌, సుబ్రహ్మణ్యం, మహేష్‌ నాయుడు, చీదేళ్ల నాగేశ్వరరావు, షేక్‌.వలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్లస్టరు బూత్‌ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

పొదిలి : తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అంద జేస్తున్నట్లు తహసీల్దార్‌ కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో మొత్తం 13086 మంది అర్హులని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ షాజీదా, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, ముల్లా ఖుద్దూస్‌, నాయకులు గునుపూడి భాస్కర్‌, రసూల్‌, మాజీ మండలాధ్యక్షుడు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, డాక్టర్‌ స్వర్ణగీత, కాటూరి చినబాబు, నాయకులు ఎస్‌ఎం భాష, సోమయ్య, వెంకట్రావు, బొడ్డు సుబ్బయ్య లబ్ధిదారులు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత సిలిండర్ల పథకం పేదలకు వరం అని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు అధికారులు, నాయకులు సిలిండర్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అమలు జేస్తోందన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస్‌, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, ఈవోపీఆర్‌డీ రామసుబ్బయ్య, టీడీపీ నాయకులు వలరాజు, ఎం.శ్రీనివాసరెడ్డి, డి.చలమయ్య, జివి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పోల్‌ మేనేజిమెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి అన్నారు. స్థానిక ఉదయ్‌ భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీలో శుక్రవారం మధ్యాహ్నం సూపర్‌ సిక్స్‌లో ఒకటైన దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. గ్యాస్‌ బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు సిలిండర్‌ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చిరంజీవి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ అర్జున్‌రెడ్డి, గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఎస్‌.పరమేశ్వరరెడ్డి, పీఎల్‌పీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో తహసీల్దారు కిన్నెర శాంతి ఆధ్వర్యంలో దీపం పథకం లబ్ధిదారులకు శుక్రవారం గ్యాస్‌ సిలెండ ర్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అవసరమయ్యే వంట గ్యాస్‌ను దీపావళి కానుకగా ఉచితంగా అందజే స్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు సాలమ్మ, పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వ రరావు, టీడీపీ నాయకులు చంటి, బట్టు సుధాకర్‌రెడ్డి, షేక్‌ మంజూర్‌ భాష, జనసేన మండల అధ్యక్షులు కేతి మోహన్‌ మురళి, నాయకులు గుర్రాల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:37 AM