Share News

స్కూల్‌ భవనాలకు వైసీపీ శాపం

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:52 PM

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మండలంలో రెండేళ్లు కిందట పూర్తికావలసిన పాఠశాలల భవనాల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సిమెంట్‌ కొరత, సిమెంట్‌ రాకపోవడంతో పనులు ఆగపోయాయి. ప్రతి స్కూలు భవన నిర్మాణానికి ఎంతో కొంత నిధులు ఉన్నప్పటికీ సిమెంట్‌ లేకపోవడంతో భవనాలు నిర్మాణం జరగలేదు.

స్కూల్‌ భవనాలకు వైసీపీ శాపం

సిమెంట్‌ బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేత

ఆగిపోయిన నిర్మాణ పనులు

విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని అవస్థలు

కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి

మార్టూరు, అక్ట్ట్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మండలంలో రెండేళ్లు కిందట పూర్తికావలసిన పాఠశాలల భవనాల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సిమెంట్‌ కొరత, సిమెంట్‌ రాకపోవడంతో పనులు ఆగపోయాయి. ప్రతి స్కూలు భవన నిర్మాణానికి ఎంతో కొంత నిధులు ఉన్నప్పటికీ సిమెంట్‌ లేకపోవడంతో భవనాలు నిర్మాణం జరగలేదు. వైసీపీ పాలనలో దాదాపుగా మూడేళ్లు కిందట నాడు-నేడు కింద మండలంలో రెండవ ఫేజు లో 23 స్కూళ్ల భవన నిర్మాణాలకు రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో శిథిలమైన కొన్ని భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తుండగా, హైస్కూళ్లలో అదనపు తరగతి గదులు, 3 అంగనవాడీ భవనాల నిర్మాణం కోసం నిధులు మం జూరయ్యాయి. మండలంలో మార్టూరులో సంపత్‌నగర్‌ లో, గొట్టిపాటి నగర్‌లో, వలపర్ల బీసీ కాలనీ తదితర గ్రా మాలలో ప్రాథమిక పాఠశాలల భవనాల నిర్మాణం, మార్టూరు, ద్రోణాదుల తదితర హైస్కూల్స్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ భవనాల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి సిమెంట్‌ను పంపించింది. బస్తా ధర రూ.250 నుంచి రూ.260 చెల్లించారు. తర్వాత సిమెంట్‌ రావడం లేదు. దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సిమెంట్‌ బిల్లులు వైసీపీ చెల్లించకపోవడంతో ఆయా కంపెనీల వారు సిమెంట్‌ను పంపడం ఆపేశారు. ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర సిమెంట్‌ను కొనే అవకాశం లేకపోవడంతో స్కూలు పనులను నిలిపివేశారు. కొన్ని స్కూల్‌ భవనాలు స్లాబు దశలో ఉండగా, మరికొన్ని ప్లాస్టింగ్‌ చేయాల్సి ఉంది. ద్రోణాదుల హైస్కూల్లో అదనపు తరగతి గదులు ఇనుప పిల్లర్లు పోసిన దశలో ఉన్నాయి. ఇంకా వివిధఽ దశలలో భవనాల నిర్మాణాలు ఉన్నాయి. మండలంలో దాదాపుగా రూ.5కోట్లతో పనులు జరిగినట్లు ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. స్కూల్‌ భవనాల పూర్తికి కూటమి ప్రభుత్వం స్పందిస్తేనే విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు తీరుతాయి. మన బడి, మన భవిష్యత్‌ కార్య క్రమాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం సిమెంట్‌ను సరఫరా చేస్తే తిరిగి పనులు ప్రారం భించవచ్చని ఉపాధ్యా యులు చెప్తున్నారు. ఈ విషయమై ఎంఈవో వస్రాంనాయక్‌ మా ట్లాడుతూ సిమెంట్‌ రాకపోవడంతో స్కూలు భవనాల నిర్మాణాల పనులు ఆగిన మాట వాస్తవమన్నారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 11:52 PM