వైసీపీ పాపం..ప్రయాణికులకు శాపం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:09 AM
గత వైసీపీ పాలకుల పాపం ప్రయాణికులకు శాపంగా మారింది. పర్చూరు - ఇంకొల్లు వెళ్లే (పాతమద్రా్‌స)రోడ్డుకు గ్రహణం వీడేలా లేదు. కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపో వడంతో పెద్ద పెద్ద గుంతలు, కంకర రాళ్లు తేలి ప్రమాదాలకు కారణంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణమంటేనే నరకమని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వాహన దారులు ప్రయాదాలకు గురవుతున్న పరిస్థితి నెల కొంది.
పర్చూరు - ఇంకొల్లు రోడ్డుకు వీడని గ్రహణం
మరమ్మతులకూ నోచుకోని వైనం
గుంతలతో అధ్వానం
అవస్థలు పడుతున్న ప్రయణికులు
పర్చూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలకుల పాపం ప్రయాణికులకు శాపంగా మారింది. పర్చూరు - ఇంకొల్లు వెళ్లే (పాతమద్రా్‌స)రోడ్డుకు గ్రహణం వీడేలా లేదు. కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపో వడంతో పెద్ద పెద్ద గుంతలు, కంకర రాళ్లు తేలి ప్రమాదాలకు కారణంగా మారింది. ఈ రోడ్డులో ప్రయాణమంటేనే నరకమని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వాహన దారులు ప్రయాదాలకు గురవుతున్న పరిస్థితి నెల కొంది. వానలు పడితే దారుణంగా మారుతుంది. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రోడ్డు బాగా దెబ్బతిన్నది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2022లో ఈరోడ్డు నిర్మాణానికి రూ.22కోట్ల సీఆర్‌ఎఫ్ నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో కల్వర్టులు, సైడ్ డ్రేన్‌లతోపాటు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఆ కాంట్రాక్టర్ ఈరోడ్డులో కల్వర్టులు, సైడ్ డ్రైన్‌లతో సరిపెట్టారు. అప్పటిలో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్ చేసేది లేక పనులను అర్ధాం తరంగా నిలిపేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మరమ్మతుకు కూడా నోచుకోక అధ్వానంగా తయా రైంది. ఎవరో చేసిన పాపం..ఇలా ప్రయాణి కులకు, ప్రజలకు శాపంగా మారింది. తరచూ రోడ్డు ప్రమా దాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందు తున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం పర్చూరు - ఇంకొల్లు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరమ్మతుల మాటే లేదు
గత వైసీపీ పాలనలో రోడ్ల అభివృద్ధి మాటే లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు బాగులేక ఘోర ప్రమాదాలు జరిగినా పాలకు స్పందించలేదు. తాజాగా రోడ్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పందించారు. సంక్రాంతి పండుగ నాటికి గ్రామ, పట్టణ రోడ్లను బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చే శారు. దీనికి సంబంధించి నిదులు మంజూరు చేశారు. అయితే పర్చూరు - ఇంకొల్లు రోడ్డుకు గతంలోనే టెం డర్ పూర్తి కావడంతో మరమ్మతులకు కూడా నోచుకోలేదు.
దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారి నళిని వివరణిస్తూ పర్చూరు-ఇంకొల్లు రోడ్డు పరిస్థితిపై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పలు రోడ్ల మరమ్మతులు మొదలయ్యాయి. ఈ రోడ్డు విషయంలో సాంకేతిక సమస్య ఉంది. త్వరలోనే సమస్య పరిష్కారమై రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.