ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ కె.మధుమూర్తి
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:53 AM
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి నియమితులయ్యారు.
ఎన్‌ఐటీ వరంగల్ నుంచి రాక
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి నియమితులయ్యారు. మూడేళ్ల కాలవ్యవధితో ఆయన్ను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్ ఎంపికపై సుదీర్ఘకాలం కసరత్తు చేసిన ప్రభుత్వం చివరకు ఆయన్ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఎన్‌ఐటీ వరంగల్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఏఐసీటీఈ సలహాదారుగా, ఎన్‌ఐటీల నిధుల సమన్వయకర్తగా, జాతీయ వృత్తి విద్యామండలి సభ్యునిగా పనిచేశారు. దేశంలోని అనేక ఎన్‌ఐటీలకు బోర్డు గవర్నర్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ పలు సంస్థల్లో భాగస్వామిగా వ్యవహరించారు. కాగా, రాష్ట్రంలో ఉన్నత విద్యను అభివృద్ధి చేయాలంటే జాతీయ స్థాయి సంస్థల్లో పనిచేసే వారు అవసరం అని భావించింది. ఇందులో భాగంగా పలువురి పేర్లను వడపోసి చివరికి మధుమూర్తిని నియమించింది. కాగా, ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వైస్ చైర్మన్ రామ్మోహన్‌రావును చైర్మన్ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీచేసింది.