Share News

Puppet show : తోలుబొమ్మలాట

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:31 PM

ధ్రప్రదేశ్‌కు చెందిన జానపద కళారూ పం తోలుబొమ్మలాట భారతదేశంలో ఎంతో ప్ర సిద్ధి చెందింది.చర్మంతో తయారు చేసిన వివి ధ బొమ్మలతో కథని తయారు చేసి జానపద కావ్యాలు, పురాణాల్లోని పాత్రలను సృష్టించుకు ని తన భాషతో మూగచిత్రాలకు ప్రాణం పోశా రు. చూపరులను అబ్బురపరిచేలా వాటిచేత రకరకాల విన్యాసాలు చేయించారు. తెరవెనుక ఉండి పాత్రలను కదిలిస్తూ జీవంలేని బొమ్మల తో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడం లో జానపదుడి కళాత్మకం దాగివుంది.

Puppet show : తోలుబొమ్మలాట
రావణుడితో వాదులాడుతున్న హనుమంతుడు

కనుమరుగవుతున్న ప్రాచీన కళలు

ఆదరణ కోల్పోతున్న కళాకారులు

ప్రత్యామ్నాయం వైపు అడుగులు

తొలి ప్రధాని మెచ్చిన ప్రాచీన కళ

పోరుమామిళ్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):ధ్రప్రదేశ్‌కు చెందిన జానపద కళారూ పం తోలుబొమ్మలాట భారతదేశంలో ఎంతో ప్ర సిద్ధి చెందింది.చర్మంతో తయారు చేసిన వివి ధ బొమ్మలతో కథని తయారు చేసి జానపద కావ్యాలు, పురాణాల్లోని పాత్రలను సృష్టించుకు ని తన భాషతో మూగచిత్రాలకు ప్రాణం పోశా రు. చూపరులను అబ్బురపరిచేలా వాటిచేత రకరకాల విన్యాసాలు చేయించారు. తెరవెనుక ఉండి పాత్రలను కదిలిస్తూ జీవంలేని బొమ్మల తో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడం లో జానపదుడి కళాత్మకం దాగివుంది. క్రీస్తుపూ ర్వం 3వ శతాబ్ధంలో తోలుబొమ్మలాటలు ఎక్కు వగా ప్రదర్శించబడేవి. అప్పటి జనుల వేడుక లో తోలుబొమ్మలాట ఒకటి. ప్రాచీన కాలంలో తోలుబొమ్మలాటకు మంచి ప్రాధాన్యత, కళాకా రులకు ప్రోత్సాహం, ఆదరణ ఉండేది. అప్పట్లో తోలుబొమ్మలాట బహుళ ప్రజాదరణ పొందిం ది. విజయనగర రాజుల కాలంలో కాలుడు అనే గొప్ప తోలుబొమ్మలాట కళాకారుడు ఉండే వాడని, ఆటలో అందె వేసిన వారని పెద్దలు చెబుతుండేవారు. ఆయన నైపుణ్యాన్ని చూసి న ఓ కవి తన కవిత్వాన్ని అతనికి అంకితం ఇచ్చాడంటే అప్పటి కాలంలో తోలుబొమ్మలాట కు ఆదరణ ఎంత ఉండేదో ఇట్టే అర్ధమవుతోం ది. తోలుబొమ్మలు ప్రదర్శించడంలో అనేక కొత్త పద్దతులు కనిపెట్టి ప్రజల మన్ననలు పొందే వారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ కళపట్ల ఆసక్తి కనబరచడంతో రాచాయిపేటకు చెందిన బాలిరెడ్డి సహకారంతో అప్పటి కళా కారులు ఢిల్లీకి వెళ్లి ప్రధాని ఎదుట ప్రదర్శనలు ఇచ్చారుట. తోలుబొమ్మలాట ప్రదర్శనలకు ఎడ్ల బండ్లలో వెళ్లి వీక్షించేవారు. టీవీలు, సినిమాలు వచ్చిన తరువాత వాటి ప్రాధాన్యత తగ్గడమే కాక ప్రాచీన కళలు కనుమరుగై పోతున్నాయి. కదిలే తోలుబొమ్మల ప్రదర్శన గురించి తెలుసు కోవాలంటే తాతయ్య, అమ్మమ్మను అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి.


1pml29.gifతోలుబొమ్మలను చూపిస్తున్న కళాకారుడు

కడప జిల్లాలో సుమారు 50 ఏళ్లకు ముందు కలసపాడు మండలం శింగరాయపల్లె నుంచి 40 కుటుంబాలకు పైగా పోరుమామిళ్ల ప్రాం తానికి వలస వచ్చి నివాసం ఉంటూ ప్రదర్శన లు ఇస్తుండేవారు. ఎక్కువగా భారతం, విరాట పర్వం, భీష్మపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, కర్ణపర్వం, ధృవపర్వంలాంటి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎక్కువగా కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు, బుడ్డకేతిగాడు ప్రతి ప్రదర్శన లో ఉండేలా వీరు నాటకాన్ని తీర్చిదిద్దేవారు. కేతిగాడి చిలిపి చేష్టలు, వారి మాటలకు జనా లు ఆనందంగా నవ్వుకునేవారు. చరిత్ర ప్రసిద్ధి గాంచిన తోలుబొమ్మలాట దేశ విదేశాల్లో సైతం ప్రజాదరణ పొందిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ కళాకారులకు విదేశీయులతో సత్సం బంధాలుండడంతో విదేశాల్లో కూడా ఈ కళాకా రులు వెళుతుండేవారు. ప్రాచీన ఓడరేవులైన భీమునిపట్నం నుంచి వ్యాపార నిమిత్తం భార తీయ వర్తకులు విదేశాలకు వెళుతుండేవారు. వీరితో కలిసి బొమ్మలాట కళాకారుల బృందా లు కూడా వెళ్లేవి. ఇలా విదేశాల్లో తోలుబొమ్మ లాట ప్రచారానికి వచ్చిందని తెలుస్తోంది. 17వ శతాబ్ధం నాటి పారిస్‌, ఫ్రాన్స్‌, ఇటలీ దేశాల్లో ఈ ఆటకు ఆదరణ దక్కింది.

తోలుబొమ్మల తయారీ...

చర్మాలను నిలువునా సాగదీసి వాటిని ఎండబెట్టి భద్రపరిచి బొమ్మల అవయవాలు కదిలేలా భాగాలు కత్తిరించి కదిలేందుకు అనువుగా అమర్చుతారు. దీంతో ప్రజలు చక్క ని వినోదం పొందేవారు. తోలుతో బొమ్మలు చేసి ఆడించడంతో తోలుబొమ్మలాటగా పేరు వచ్చింది. సంస్కృతంలో ఛాయానాటకంగా పిలుస్తారు. బొమ్మలాట తెరకు వెలుతురు కనబడని ముతక వస్త్రాన్ని ప్రత్యేకంగా ఉప యోగించేవారు. దాదాపు 24 అడుగులు తెర వెనుక 12 అడుగుల ఖాళీస్థలంలో వాయిద్య కళాకారులు పాటలు పాడేవారు. ప్రదర్శన కోసం అప్పట్లో ఆముదపు దీపాలు, కాగడాలు ఉపయోగించేవారు. కాలక్రమేణా ఎరుపు ట్యూ బులైట్లతో బొమ్మలను ఆడించేవారు. బొమ్మకు కొక్కీలు ఏర్పాటు చేసి కళాత్మకంగా బొమ్మలను ఆడిస్తూ వినోదం అందించేవారు.


3pml29.gifఅప్పటి సీఎం చంద్రబాబు నుంచి జ్ఞాపిక అందుకుంటున్న పెద్ద మునిరావు (ఫైల్‌)

తగ్గిన ఆదరణ

తోలుబొమ్మలాటకు రానురాను ఆదరణ తగ్గింది. అప్పుడప్పుడూ టీవీల్లో ఆదివారం ప్రత్యేకించి ఈ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పుడు చూడాలంటే ఏ తెలుగు మహాసభల కోసమో, సాంస్కృతిక చిహ్నంగా ప్రదర్శిస్తుంటారు. ప్ర స్తుతం కాలగర్భంలో కలిసిన గ్రామీణ కళల జాబితాలో చేరుతోంది. తోలుబొమ్మలాట కళా కోవిదుల బతుకుదెరువుపై గీతాలాపనే ఇప్పుడి క మిగిలింది. మహోన్నత చరిత్ర కలిగి దేశ విదేశాల్లో ఆహ్లాదం, వినోదం అందించిన తోలు బొమ్మలాటలు నేడు పూర్తిగా కనుమరుగయ్యా యి. వాటిని నమ్ముకున్న కళాకారులు వీధిన పడ్డారు. సరైన ఆదరణ లేకపోవడంతో తోలుబొ మ్మలు ఆడించి పొట్ట పోసుకుని జీవనం సాగించే కళాకారులు వీధినాటకం ఆడే భాగవ తులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నా రు. పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడ్డ సమాజం గతంలో తోలుబొమ్మలాట ఉందనే విషయం కూడా మరిచారు. రాజులను సైతం మైమరిపించిన ఈ ఆటను తిరిగి తెరపైకి తె చ్చేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదన డంతో సందేహంలేదు.

ప్రభుత్వ పథకాల్లో ప్రచారం...

ప్రభుత్వ పథకాల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం ఇచ్చా రు. కళనే నమ్ముకున్న కొందరు కళపై మక్కువ ను వదులుకోక తిరుణాళ్ల, జాతర వంటి క్షేత్రాల్లో గ్రామస్తుల కోరిక మేరకు ప్రదర్శనలు ఇస్తున్నారు. మహా భారతం, రామాయణం, ప్రమీలార్జునీయం, విరాట పర్వం, భీష్మపర్వం, పద్మవ్యూహం, సైంధవవధ, కర్ణపర్వం, ధృవ పర్వం ప్రదర్శనలు ఇచ్చేవారు. కేతిగాడు, బం గారక్క, జుట్టు పోలిగాడు, బుడ్డకేతిగాడు ప్రద ర్శనలో కీలకంగా ఉండేవారు. ముఖ్యమంత్రి ద్వారా అవార్డులు కూడా అందుకున్నారు.

తొలి ప్రధాని మెచ్చిన కళ

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ కళ గురించి విని ఆసక్తి కనబరచడంతో అప్పటి కళాకారులు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు. రాచా యిపేటకు చెందిన బాలిరెడ్డి సహకారంతో వెంకట్రావు, సుబ్బారావు, గోవిందరావు. రామో జీరావు, క్రిష్ణారావు, ఎరికలమ్మ, జానకమ్మ బృందం ఢిల్లీలోని సర్వదేవాపురం వద్ద పద్మ యాగం, సైంధవవధ బొమ్మలాట ప్రదర్శించార ని అప్పటి కళాకారులు చెబుతున్నారు. ఈ కళ కు ఉన్న ఆదరణ గురించి తోలుబొమ్మలాట కళాకారిణి జానకమ్మ ఓ పత్రికలో తన జ్ఞాపకా లను నెమరువేసుకుందని వనపర్తి పెద్దముని రావు తెలిపారు. ఆమెకు చదువు రాక పోయినా రామాయణం, భాగవతఘట్టాలు ఆకట్టుకునేలా కథనం చెప్పేవారు. ప్రధాని నెహ్రూ కళాకారు ల ప్రదర్శనలు వారం రోజులు వీక్షించి వారిని ఆదరించారని ఇప్పటి కళాకారులు తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:31 PM