Share News

తిరుమల గణపతి గుడిలో... గోశాలల ఒడిలో తన్మయంగా పురాణపండ శ్రీనివాస్

ABN , Publish Date - May 14 , 2024 | 11:28 PM

తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.

తిరుమల గణపతి గుడిలో... గోశాలల ఒడిలో తన్మయంగా పురాణపండ శ్రీనివాస్

తిరుపతి, మే 14 : అత్యున్నత సంస్కారవంతుల్లో మొదటివరసలో ఉండే ఒక వందమందిలో ఒకరుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ స్నేహశీలత, జ్ఞానం పట్ల తృష్ణ, మనుషుల పట్ల గౌరవం ...తిరుమల అర్చకుల, పండితుల పట్ల ఎంతో ఆరాధనీయంగా గోచరిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో కొందరు అధికారులు మంగళవారం చర్చించుకోవడం ఆశ్చర్యకరంగా కనిపించిందని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగ సహోద్యోగులు కుతూహలంగా ఒకరికొకరు చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.

తిరుమల పర్వత శ్రేణుల్లో కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో... అనగా లగేజీ చెకింగ్ టోల్ గేట్ దాటాక వచ్చే అతి ముఖ్యమైన వినాయగర్ టెంపుల్... తెలుగులో వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఈ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం సరాసరి తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. తరువాత శ్రీవారి దర్శనం చేసుకున్న శ్రీనివాస్ శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.

Ugram-Veeram.jpg

శ్రీనివాస్ ఎప్పుడొచ్చినా అలిపిరివద్ద లేదా, కొండపై గోశాలలో కాస్సేపు గడుపుతారు. ఆయన రచించి ప్రచురించబోయే ప్రత్యేక గ్రంధాలకు గోశాలలో పవిత్ర సంకల్పం చేసుకుంటారని, ఆ బుక్స్ అద్భుతం సృష్టిస్తాయని పురాణపండకు ఆత్మీయులైన తిరుమల ధర్మగిరికి చెందిన పండితులు కొందరు పేర్కొన్నారు. శ్రీనివాస్ ఎప్పుడు తిరుమలకి వచ్చినా తిరుపతి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అధికార అనధికారులకు ఎప్పటికప్పుడు క్రొత్త పవిత్ర గ్రంధాలు అందజేయడం దశాబ్దన్నరగా శ్రీవారి అనుగ్రహంగా జరగడం విశేషం.

తిరుపతి వేద విశ్వ విద్యాలయం, తిరుమల వేద పాఠశాల, సప్తగిరి కార్యాలయం, తిరుమల అర్చక భవన్, శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయాల్లో సైతం అనేకమంది కేవలం పురాణపండ శ్రీనివాస్ బుక్స్ కి అధిక ప్రాధాన్యతనివ్వడం గమనార్హం.

Puranapanda-at-Ganapathi-Te.jpg

పురాణపండ శ్రీనివాస్‌లో మనం అస్సలు స్వార్ధం చూడలేమని, ఆయన గ్రంధాల భాషా సొగసులు, ముద్రణా సొగసులు, అతి అరుదైన వర్ణభరిత చిత్రాల సొగసులు ‘అహో’ అనిపిస్తాయని తిరుమల ఆగమ సలహాదారు రమణ దీక్షితులు మొదలు, తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ వరకూ పురాణపండ రచనతో పాటు ఆయన నిస్వార్ధ యజ్ఞ సేవను అభినందినవారేనని పలువురు అర్చక భవన్ ప్రముఖులు పేర్కొంటున్నారు.

పురాణపండ శ్రీనివాస్ విభిన్న రచనా సంకలనాలైన మహా మంత్రస్య, పచ్చ కర్పూరం, యుగే యుగే, స్మరామి స్మరామి, హరే హరే, కృష్ణం విష్ణుం, శ్రీలహరి, శ్రీ పూర్ణిమ, శ్రీమాలిక, శరణు శరణు, అమ్మణ్ణి, ననుగన్న నా తండ్రి, నన్నేలు నాస్వామి, నేనున్నాను, శివోహం, శివశ్శివం, శంకర శంకర, భద్రే రుద్రే, జయం జయం, జయ జయోస్తు, దుర్గే ప్రసీద, శ్రీనివాసో విజయతే, ఉగ్రం వీరం.. వంటి ఎన్నో గ్రంధాలు తిరుమల తిరుపతికి చెందిన కొందరు ఉద్యోగుల, పండితుల, అర్చకుల వద్ద ఉండటం కేవలం శ్రీవారి అనుగ్రహమే!

Srinivas.jpg

టిటిడి పూర్వ కార్యనిర్వహణాధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యం సమర్ధ నిర్వహణలో ఒకసారి జరిగిన దేవస్థాన ప్రచురణశాఖ సమావేశంలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కరూ ఇంతటి అద్భుత అపురూప మహాకార్యాన్ని నిస్వార్ధంగా నిర్వహిస్తున్నారని, ఇంతమంది ఉన్న మనం ఇంకా మహాద్భుతాలు ప్రచురణ శాఖతో నిరూపించాలని చర్చించుకున్నట్లు సమాచారం.

KCR.jpg

ఇటీవల దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళికి సహృదయ కృతజ్ఞతలు ప్రకటిస్తూ వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించిన అమృత ప్రాయపు అఖండ గ్రంధం ‘శంకర శంకర’ గ్రంధానికి కూడా రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ కావడం, ఈ పుస్తకం తిరుమల తిరుపతిలో చాలామంది ఉద్యోగులకు అంది సంతోషాన్ని కలిగించడం కన్నులముందే కనిపించిన సత్యం.

Ponnala-Lakshmaiah.jpg

అన్నిటికీ మించి ఈ బుధవారం తెలంగాణా రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవిష్కరించనున్న మహా నారసింహ మంత్రం తేజస్సు ‘ఉగ్రం వీరం’ గ్రంధం ముందుగానే తిరుమల పండితుల్లో కొందరికి చేరడం తిరుమల యోగ నారసింహుని అనుగ్రహం కాక ఇంకేమిటి?! ఈ నరసింహస్వామి గ్రంధం ప్రత్యేక విశేషంగా చాలా ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ఐటి శాఖామంత్రి , తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ప్రచురించి ఉచితంగా అందించడం మరొక విశేషం. అలాగే మిగిలిన పండిత అర్చక విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులకు త్వరలోనే పొన్నాల లక్ష్మయ్య ఎంతో సంస్కార భరితంగా అందిస్తారని ఆయన సన్నిహితులు తిరుమల వర్గాలకు తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - May 14 , 2024 | 11:32 PM