Home » Ponnala Lakshmaiah
పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం తెలంగాణ గవర్నర్‌ను కలిశారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.కాంట్రాక్టర్లు రూ,200 కోట్లు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.
యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్‌కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు
గ్రంథ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొంటూ ఈ పవిత్ర గ్రంధాన్ని వేల ప్రతుల్లో ప్రచురించి మహా పుణ్య కార్యంగా భుజాలకెత్తుకున్న లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎన్నెన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు ‘ఉగ్రం వీరం’ను చేరుస్తున్న ప్రచురణకర్త లక్ష్మయ్య ఆత్మ సమర్పణాభావాన్ని అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే...
తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్‌కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి రాజకీయ ‘జయోస్తు’ పలకడం కోసం పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ పురాణపండ శ్రీనివాస్ చేత అపురూపమైన అద్భుత మహా నారసింహ స్వామి వారి ప్రత్యేక గ్రంధాన్ని రచింపజేయడానికి పురాణపండకు కబురు పెట్టినట్లుగా టీఆర్ఎస్ శ్రేణుల్లో వినబడుతోంది.
Telangana: బీఆర్ఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ చచ్చిన పాము అంటున్నారని.. కేవలం 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు. కేసీఆర్ రాజకీయ చరిత్రకు...
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతుల చిత్రాలతో ఒక విలువైన గ్రంధాన్ని శ్రీవైష్ణవ క్షేత్రాలకు, నృసింహ క్షేత్రాలకు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రధాన నాయికా నాయకులకు అందించాలనే తపనతో ఒక నృసింహ తేజస్సును గ్రంథ రూపంలో ప్రచురించి బహూకరించాలని సంకల్పించినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో సమాచారం నడుస్తోంది.