Share News

Purandheswari : విజయవాడ ముంపు పాపం వైసీపీదే

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:36 AM

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Purandheswari : విజయవాడ ముంపు పాపం వైసీపీదే

  • ఐదేళ్లలో బుడమేరు కట్టలపై గడ్డి పరక తీయలేదు: పురందేశ్వరి

జి.కొండూరు, సెప్టెంబరు 6: ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రికార్డు సమయంలో సహాయ చర్యలు చేపడుతున్నాయి. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురా లు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీడీసీ ఎడమ గ ట్టుకు పడిన గండ్లుకు చేస్తున్న మరమ్మతు పనుల్ని ఆమె శుక్రవారం మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి పరిశీలించారు. ఆమె మాటాడుతూ.. ‘సీఎం చంద్రబాబు ఫోన్‌ చేయగానే ప్రధాని మోదీ తక్షణం స్పందించి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను, బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ వాళ్లను పంపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రూ.300 కోట్లు బుడమేరు ఆధునీకరణకు కేటాయిస్తే వైసీపీ ప్రభు త్వం వాటిని రద్దు చేసింది. ఐదేళ్లలో బుడమేరు కట్టలపై గట్టి పరక కూడా తీయలేదు. తట్ట మట్టి కూడా వేయలేదు. అందుకే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చిం ది. తమ హయాంలో బుడమేరుకు ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలి. ప్రజలు బాధల్లోను, రాష్ట్రం కష్టకాలంలో ఉంటే రాజకీయాలు చేయడం తగదు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ప్రధాని మోదీ పంపారు. వరద నష్టం అంచనా వేసి ఆయన కేంద్రానికి అందిస్తారు. బాధితులకు తక్షణ, దీర్ఘకాలిక సహాయం ఏవిధంగా అందించాలనేదానిపై దృష్టి పెడతాం’ అని పురందేశ్వరి తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 04:36 AM