Share News

AP Politics: సీఎం జగన్‌ను కేశినేని కలవడంపై పీవీపీ సెటైర్.. మామూలుగా లేదుగా..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:35 AM

ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నాని బుద్ది గురించి బెజవాడంతా తెలుసని పేర్కొన్నారు.

AP Politics: సీఎం జగన్‌ను కేశినేని కలవడంపై పీవీపీ సెటైర్.. మామూలుగా లేదుగా..!

అమరావతి: ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నాని బుద్ది గురించి బెజవాడంతా తెలుసని పేర్కొన్నారు. ‘‘బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇందుకే రచ్చ!

విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నాని ప్రకటించిన వెంటనే కూడా పీవీపీ ఆయనపై విమర్శలు గుప్పించారు. కేశినేని నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు కేశినేని నాని బండిని లాక్కొచ్చారంటే అది టీడీపీ చలవతోనేనన్నారు. బ్యాంకులను బాది, ప్రజలను, ఉద్యోగులను కేశినేని నాని పీల్చి పిప్పి చేశారన్నారు.ఇప్పుడు కేశినేని నాని జగన్‌ను కలిశారనగానే మరోసారి పీవీపీ ఎక్స్ వేదికగా తనదైన స్టైల్లో స్పందించారు.

PVP-Tweet.jpg

కనిపించరేం!

అయితే 2019 ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. కేవలం నాని 8,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత పీవీపీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఆయన మాత్రం అడ్రస్ లేరు. ఇప్పుడు ప్రత్యర్థి కాస్త సొంత పార్టీలోకి రావడంతో పీవీపీ రగలిపోతున్నట్లు ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Jan 11 , 2024 | 10:46 AM