ఏపీలో పలుచోట్ల వర్షాలు
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:57 AM
కోస్తా ఆంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
కావలిలో 38.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కోస్తా ఆంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో అనేకచోట్ల శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షం కురిసింది. ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా శనివారం కావలిలో అత్యధికంగా 38.9డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.