Share News

Atchutapuram : ఎర్రబొంతులు.. మత్స్యకారుల కళ్లలో కాంతులు!

ABN , Publish Date - Dec 15 , 2024 | 06:04 AM

ఇవేమీ అక్వేరియంలోని చేపలు కావు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుల వలలకు సముద్రంలో చిక్కిన ఎర్రబొంతులు.

Atchutapuram : ఎర్రబొంతులు.. మత్స్యకారుల కళ్లలో కాంతులు!

ABN Andhra Jyoti : ఇవేమీ అక్వేరియంలోని చేపలు కావు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుల వలలకు సముద్రంలో చిక్కిన ఎర్రబొంతులు. అల్పపీడనం కారణంగా వారం రోజుల నుంచి వేటకు దూరంగా ఉన్న మత్స్యకారులు.. శనివారం సముద్రంలోకి వెళ్లారు. వేటకు వెళ్లిన మత్స్యకారులందరికీ చేపలు భారీగా పడ్డాయి. ఎక్కువగా అభిలాష చేపలు చిక్కాయి. ఇవి కిలో రూ.100-150కి అమ్ముడుపోగా, ఎర్ర బొంతులను మాత్రం కిలో రూ.300కు కొన్నారు. ఎర్ర బొంతు చేపలు అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు చెప్పారు.

-అచ్యుతాపురం, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 15 , 2024 | 06:04 AM