YSRCP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై స్పందించండి.. బీజేపీకి ఆడారి కిశోర్ సవాల్
ABN , Publish Date - May 06 , 2024 | 11:44 PM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిప్పు రాజేస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
అనకాపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిప్పు రాజేస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇదే అంశంపై వైసీపీ అనకాపల్లి లోక్ సభ ఇంఛార్జి ఆడారి కిశోర్ కుమార్(Adari Kishore Kumar) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై అనవసర రాద్ధాంతరం చేస్తున్నాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై బీజేపీ సైతం అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
ఈ యాక్ట్‌పై నిజానిజాలేంటో ప్రధాని మోదీ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కడప నుంచి వలస వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్.. అనకాపల్లిపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని.. ప్రజలు ఆయన మాటలు నమ్మకూడదని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనతో చర్చకు రావాలని రమేశ్‌ను డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ప్రజలను ఆయన కోరారు.