pithapuram: రైతులే టార్గెట్: వర్మ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:48 PM
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార వైసిపి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. రుణ బకాయిలు చెల్లిస్తారా? లేకుంటే వైసీపీకి మద్దతు ఇస్తారా? అంటూ డీసీసీబీ రికవరీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారన్నారు.
కాకినాడ, ఏప్రిల్ 12: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార వైసిపి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. రుణ బకాయిలు చెల్లిస్తారా? లేకుంటే వైసీపీకి మద్దతు ఇస్తారా? అంటూ డీసీసీబీ రికవరీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారన్నారు.
AP Elections: అలాంటి వారి వల్ల పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.. వర్ల రామయ్య..
వైసీపీకి మద్దతు ఇస్తే.. రుణ బకాయిలు అడగమని సదరు బ్యాంకు అధికారులు ప్రజలకు స్పష్టం చేస్తున్నారని వివరించారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రైతులను మాత్రమే బ్యాంక్ అధికారులు టార్గెట్ చేస్తున్నారని ఈ సందర్బంగా ఆయన మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని సదరు బ్యాంకు అధికారులకు వర్మ హెచ్చరించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బరిలో దిగారు. అయితే ఆయన్ని ఓడించేందుకు అధికార జగన్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే సదరు నియోజకవర్గంలోని జనసేన పార్టీకి చెందిన కీలక నేతలను వైసీపీ తన వైపునకు తిప్పుకొంది. అలాగే పవన్ ఓటమే లక్ష్యంగా సదరు నియోజకవర్గంలో జగన్ పార్టీ పావులు కదుపుతోంది.
అన్ని సమస్యలకు ఒకటే మందు.. ఎన్నికల వేళ విదేశాలకు విజయమ్మ
మరోవైపు పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. పిఠాపురం ఎలాగైనా వైసీపీ ఖాతాలో పడే విధంగా జగన్ పార్టీ నాయకులు పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. అదీకాక గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. అటు గాజువాక, ఇటు భీమవరం నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు.
నాయి బ్రాహ్మణులపై పుట్టా మహేష్ వరాల జల్లు
దీంతో ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయారంటూ.. వైసీపీ నాయకులు పవన్‌పై విమర్శలు గుప్పించిన విషయం విధితమే. ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురంలో ఎలాగైనా ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలవాలని.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నాయి.
ఏపీ వార్తలు కోసం..