Share News

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:40 AM

రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

అమరావతి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు యాదవ్‌, బీజేపీ నుంచి ఆర్‌ కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేయగా.. వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ముగ్గురూ శుక్రవారం అసెంబ్లీకి వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వనితా రాణి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 04:41 AM