Share News

Secretary MM Nayak : మారుమూల పశుపోషకులకూ సేవలందాలి

ABN , Publish Date - Dec 21 , 2024 | 05:45 AM

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల పశుపోషకులకు కూడా పశు సంవర్ధక శాఖ సేవలు అందేలా చూడాలని ఆ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ అధికారులను ఆదేశించారు.

Secretary MM Nayak : మారుమూల పశుపోషకులకూ సేవలందాలి

అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల పశుపోషకులకు కూడా పశు సంవర్ధక శాఖ సేవలు అందేలా చూడాలని ఆ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిర్ణీత వేళలో పశువులకు టీకాలు వేయాలని, గోకులంపథకం కింద ఉపాధి నిధులతో షెడ్లు నిర్మించాలని, బహువార్షిక పశు గ్రాసాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 05:45 AM