Senior IAS Officer:రిటైరైన ధనుంజయరెడ్డి
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:46 AM
జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి పేషీలో ఐదేళ్లు
చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆయన్ను తన పేషీలోకి తీసుకున్నారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అసలు ఆయనకకు ఐఏఎస్ హోదా రావడమే చిత్రవిచిత్రంగా జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అండమాన్-నికోబార్ దీవుల నుంచి ఆయన్ను ఏపీకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్ హోదా కల్పించింది. తొలి నుంచి అత్యంత ప్రాధాన్య పోస్టింగుల్లో నియమించింది. శుక్రవారంతో ఆయన 60 ఏళ్లు పూర్తికావడంతో పదవీ విరమణ చేశారు. ఆయన రిటైర్మెంట్‌పై సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ఐజీ రవీంద్రబాబు కూడా శుక్రవారం రిటైరయ్యారు.
సీఎ్‌సకు శ్రీనివాసరాజు జాయినింగ్ రిపోర్టు..
సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎ్‌స.శ్రీనివాసరాజు ఏపీలో రిపోర్ట్ చేశారు. శుక్రవారం ఉదయం సీఎస్ జవహర్‌రెడ్డికి తన జాయినింగ్ రిపోర్టు అందించారు. 2020 మే నెలలో ఇంటర్-కేడర్ డిప్యుటేషన్‌పై తెలంగాణకు వెళ్లిన ఆయన.. నాలుగేళ్ల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఈ ఏడాది మార్చితో డిప్యుటేషన్ గడువు ముగిసింది. అనంతరం రెండు నెలలు సెలవు పెట్టి ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు. పోస్టింగ్ ఇచ్చే వరకూ ఆయన జీఏడీలోనే ఉంటారు.