Share News

Palnadu News: రక్షకుడే భక్షకుడు.. దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jan 22 , 2024 | 06:09 PM

పోలీసులు ఉన్నది.. ఆపదలోనూ, ఇతర సమస్యల్లోనూ చిక్కుకున్న సాధారణ ప్రజలను రక్షించడానికి! అన్యాయాన్ని అణగదొక్కి, న్యాయాన్ని గెలిపించడమే వారి ధ్యేయం. కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భక్షకులుగా ప్రవర్తిస్తూ.. సాధారణ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Palnadu News: రక్షకుడే భక్షకుడు.. దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం

పోలీసులు ఉన్నది.. ఆపదలోనూ, ఇతర సమస్యల్లోనూ చిక్కుకున్న సాధారణ ప్రజలను రక్షించడానికి! అన్యాయాన్ని అణగదొక్కి, న్యాయాన్ని గెలిపించడమే వారి ధ్యేయం. కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భక్షకులుగా ప్రవర్తిస్తూ.. సాధారణ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఓ హెడ్ కానిస్టేబుల్ చేసిన అన్యాయానికి, పెట్టిన టార్చర్‌ని తట్టుకోలేక.. ఓ దళిత యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

పల్నాడులోని రొంపిచర్లకు చెందిన శివకృష్ణ అనే ఓ యువకుడు.. కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడ్ని అడ్డుకున్నారు. ఈ పనికి ఎందుకు పాల్పడ్డావని ప్రశ్నిస్తే.. రొంపిచర్ల గ్రామంలో తనకు, తన తల్లికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని చిలకలూరిపేటలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఉయ్యాల రమేష్, అతని అనుచరులు కబ్జా చేశారని అతడు ఆరోపించాడు. అంతేకాదు.. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని సైతం ధ్వంసం చేసి, ఆ స్థలాన్ని కూడా బలవంతంగా ఆక్రమించుకున్నారని బాధితుడు రోధించాడు.

తనకు జరిగిన ఈ అన్యాయంపై తాను ఎన్నోసార్లు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కానీ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకిక న్యాయం దక్కదని భావించి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనని వాపోయాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని అతడు వేడుకున్నాడు. ఆ హెడ్ కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకొని, తన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jan 22 , 2024 | 06:11 PM